స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ యశోద.హరి – హరీష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
పుష్ప ఐటెం సాంగ్ తర్వాత మరో సినిమాను రిలీజ్ చేయక పోవడంతో సామ్ ఫ్యాన్స్ కు ఈగర్ గా ఈ సినిమా కోసం ఎదురు చూసారు.
ఇక ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
కొన్ని కారణాల వల్ల లేట్ అవుతూ వస్తున్న ఈ సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకుంది.శివలెంక కృష్ణ ప్రసాద్ శ్రీదేవీ మూవీస్ పతాకంపై పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను నిర్మించారు.
ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా.వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించింది.
ఈ సినిమా సామ్ కెరీర్ లోనే సాలిడ్ హిట్ అందుకుని వసూళ్లు కూడా అదే రేంజ్ లో రాబడుతుంది.40 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మేకర్స్ ఆశించిన విజయం అందుకోవడంతో మరింత సంతోషంగా ఉన్నారు.అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంది అని కొన్ని రోజులుగా నెట్టింట వార్తలు వస్తున్నాయి.
![Telugu Hari Harish, Mani Sharma, Samantha, Samantharuth, Yashoda-Movie Telugu Hari Harish, Mani Sharma, Samantha, Samantharuth, Yashoda-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/11/Yashoda-Samantha-Ruth-Prabhu.jpg )
అయితే ఈ వార్తలపై సక్సెస్ మీట్ లో మేకర్స్ హింట్ ఇచ్చి ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు.సమంత ఒప్పుకుంటే తప్పకుండ యశోద సినిమాకు రెండు కంటిన్యూస్ పార్టులు తెరకెక్కించే అవకాశం ఉందని తెలిపారు.సామ్ ఆరోగ్యం నుండి పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ సీక్వెల్ పై ఆమెపై మాట్లాడుతాము అని కన్ఫర్మ్ చేయడంతో ఎలాగైనా దీనికి సీక్వెల్ ఉంటుంది అని కన్ఫర్మ్ అవ్వడంతో సామ్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.చూడాలి మరి ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుందో.