నుదుటిపై తిలకం పెట్టుకోవడం మనదేశంలో చాలా మంది ప్రజల సంస్కృతి.తిలకం యొక్క ప్రాధాన్యత పురాణాల్లో చెప్పారు.
అయితే కొంతమంది ఎరుపు తిలకాన్ని ధరించకూడదు అని చెబుతూ ఉంటారు.దానివల్ల వారి జీవితాలలో సమస్యలు వస్తాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు.
తిలకం పూయడం వల్ల వ్యక్తిత్వంలో సాత్వికం ప్రతిబింబిస్తుంది.అయితే అందరూ ఎర్ర తిలకం ధరించకూడదని చాలామందికి తెలియదు.
కొన్ని రాశుల వారికి ఎర్ర రంగు తిలకం ఆ శుభమని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది.ఎర్ర రంగు తిలకం ఏ రాశి వారు ధరించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో పురాతన పురాణాలలో తిలకం దేవుడిపై విశ్వాసానికి గుర్తుగా చెబుతారు.అందుకే ప్రతి శుభకార్యానికి ముందు తిలకం దిద్దుతారు. నుదుటి పై తిలకం రాసుకోవడం వల్ల శాంతి, బలం చేకూరుతాయని చాలామంది నమ్ముతారు.మన జీవితంలో ఆనందం రావడం, వెళ్లడం అనేది గ్రహణ కదలికలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
అన్ని రంగుల కన్నా ఎరుపు రంగు ఎంతో శక్తివంతమైనది. కుజుడు ధైర్యం, బలానికి సంబంధించిన గ్రహం కాబట్టి ఈ రంగు కూడా అంగారకుడి పై ప్రభావం చూపుతుందని తెలిసింది.
ఈ రంగు శక్తివంతమైన స్వభావాన్ని, అభివృద్ధి, కోపాన్ని కలిగి ఉంటుంది.కాబట్టి ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించడం అంత మంచిది కాదు.ఈ రాశులలో కుజుడు బలహీనంగా ఉంటాడని ఈ రాశి వారు ఎరుపు రంగుకు దూరంగా ఉండడమే మంచిది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని, కుజుడు ఒకరికొకరు శత్రువులుగా జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు.ఈ వ్యక్తులు కూడా ఎరుపు రంగు తిలకం పెట్టుకోకూడదు.శనికి ఇష్టమైన రంగు నలుపు.
శని ఎరుపును ద్వేషిస్తాడు.శని మకరం, కుంభ రాశికి అధిపతి గా ఉంటాడు.
అటువంటి పరిస్థితులలో ఎరుపు రంగు మాకరం, కుంభ రాశికి ఆ శుభముగా చెబుతారు.