Salt Earth : ఉప్పు కరువు కాటకాలను గుర్తించగలదు..గ్రహాన్ని చల్లబరచగలదు అని తెలుసా?

ఉప్పు లేకుండా మనకు రోజు గడవదు.ఏం తిన్నా సాల్ట్ అవసరమే.మహా సముద్రాలన్నీ ఉప్పు మయమే.ఐతే… సాల్ట్‌కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలున్నాయి.అవేంటో తెలుసుకుంటే ఒకింత ఆశ్చర్యం కలగకమానదు.ఉప్పు ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా తిక్కు కుదురుతుందట.ఉప్పును ఎంత తినాలో అంతే తినాలి.మోతాదు మించితే ప్రమాదమే.
ఉప్పు అంటే రోజువారీ కూరల్లో వేసుకునే ఓ పదార్థంగా మనం భావిస్తాం.ఈ ఖనిజాన్ని పరిశోధించిన శాస్త్రవేత్తలకు చిత్రమైన విషయాలు తెలిశాయి.తెల్లగా, నీటిలో వెయ్యగానే కరిగిపోయే సాల్ట్‌తో జాగ్రత్తగా ఉండకపోతే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలిసొచ్చింది.సబ్బు కంటే చక్కగా గాయాల్ని శుభ్రం చేస్తుంది ఉప్పు.

 Scientists Have A Plan To Cool The Earth With A Sprinkle Of Salt,salt,planets,ea-TeluguStop.com

చిన్నప్పుడు బుక్స్‌లో చదివే ఉంటారు.కుక్క కరవగానే సబ్బుతో గాయాన్ని కడగాలి అని.జనరల్‌గా ఏ గాయమైనా సబ్బుతో క్లీన్ చెయ్యడం మనకు అలవాటు.కానీ సోప్ కంటే ఉప్పు నీటితో గాయాల్ని కడిగితే, ఇన్ఫెక్షన్లు రావని పరిశోధనల్లో తేలింది.

సబ్బుల్లో కొన్ని, లోపలి చర్మానికి హాని చేస్తాయి.సాల్ట్ మాత్రం హాని చెయ్యదంటున్నారు సైంటిస్టులు.

సో ఈ సారి ఈ చిన్న టిప్ ని కూడా ఒకసారి వాడి చూడండీ.ఫలితం ఉంటుంది.

Telugu Change, Earth, Planets, Salt, Telugu-General-Telugu

ఉప్పు ఎక్కువైతే దిమ్మ తిరగడం ఖాయమంట.ఉప్పు ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బందే.ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తింటే, అది మెదడులో మంట, నొప్పి, దురదలు వంటివి వచ్చేలా చేస్తుందట.ఎలుకలపై ప్రయోగాలు చెయ్యగా, సాల్ట్ ఎక్కువైన ఎలుకలు… పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాయి.

నమక్ సరిపడా తిన్న ఎలుకలు మాత్రం సైలెంట్‌గా ఉన్నాయని తేల్చారు.ఇలాంటి ఏ పరిశోధనలు చేయాలన్నా ఎలకలనే వాడుతారు.

అసలు ఎలుకలను ఎందుకు పరిశోధనలకు వాడుతారు అనే వీడియో మన ఛానెల్ లో ఉంది.చూసేయండి.

ఇక ఉప్పు నక్షత్రాల జీవితకాలం తక్కువ.ఇది ఇంకో ఆసక్తికర అంశం.

సాధారణంగా నక్షత్రాలు చనిపోయేటప్పుడు హైడ్రోజన్, హీలియం మండుతాయి.ఆ తర్వాత గ్యాస్, దుమ్మును ఎగజిమ్ముతాయి.

చివరకు మరుగుజ్జు నక్షత్రాలుగా మారతాయి.ఐతే, సోడియం అంటే ఉప్పు ఎక్కువగా ఉండే నక్షత్రాలు గ్యాస్, దుమ్మును ఎగజిమ్మవు.

వెంటనే మరుగుజ్జు నక్షత్రాలుగా మారతాయి.

Telugu Change, Earth, Planets, Salt, Telugu-General-Telugu

మన గ్రహాన్ని చల్లబరచగలదు కూడా ఉప్పు.భూ వాతావరణంలో ఉప్పుని చల్లితే చాలు, అది వాతావరణాన్ని చల్లగా చేస్తుంది.భూతాపాన్ని తగ్గిస్తుంది.

ఐతే, ఇదే సాల్ట్… మన భూమిపై ఉన్న ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్‌లను నాశనం చెయ్యగలదు.అందువల్ల భూమిపై వేడిని తగ్గించేందుకు ఉప్పును చల్లడం సరైన చర్య కాదని పరిశోధకులు తెలిపారు.

కరవు కాటకాల సమాచారం చెబుతుంది కూడా చెప్పేస్తుంది ఉప్పు.మృత సముద్రం కింద శాస్త్రవేత్తలు డ్రిల్లింగ్ చేశారు.

సాల్ట్ శాంపిల్స్ సేకరించారు.సాధారణంగా వర్షాలు బాగా పడినప్పుడు భూమిలో ఉప్పు పొర తక్కువగా పేరుకుంటుంది.

శాస్త్రవేత్తల పరిశోధనను బట్టీ గత పది లక్షల సంవత్సరాల్లో భూమిపై చాలా కరవు కాటకాలు వచ్చాయి.ఆ స్థాయి కరవు ఇప్పుడు వస్తే, తట్టుకోవడం కష్టమే.

ప్రభుత్వాలకు తలనొప్పిగా మారేది కూడా సాల్టే.షుగర్ ఎంత తీసుకోవాలి, ఎక్కువ తీసుకుంటే కలిగే నష్టాలేంటో ప్రపంచంలో చాలా మందికి తెలుసు.అందువల్ల చక్కెర వాడకాన్ని చాలావరకూ తగ్గించారు.ఉప్పు ఎక్కువ తీసుకుంటే ప్రమాదం అన్న విషయం చాలా మందికి తెలియదు.

అందువల్ల ప్రపంచ దేశాల్లో ఉప్పును ఎక్కువగా తీసుకుంటున్నారు.దీన్ని కంట్రోల్ చెయ్యడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube