ఏపీలో డీఈడీ కాలేజీల గుర్తింపు రద్దు జీవోను హైకోర్టు కొట్టివేసింది.318 డీఈడీ కాలేజీల గుర్తింపును రాష్ట్ర సర్కార్ రద్దు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వం ఉత్తర్వులను కొట్టివేసింది.దీంతో కాలేజీలు యధావిధిగా నడవనున్నాయి.







