కెనడాలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. నిందితుల్లో ముగ్గురు భారత సంతతి వ్యక్తులు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం కెనడాకు వెళ్లిన పలువురు భారతీయులు అక్కడ ఉన్నత స్థానానికి చేరుకుని ఇరుదేశాలకు గర్వకారణంగా నిలుస్తుంటే… కొందరు క్రైమ్ వరల్డ్ వైపు అడుగులు వేసి నేర సామ్రాజ్యాన్ని శాసిస్తున్నారు.వీరిలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారే ఎక్కువ.

 3 Men Of Indian Origin Arrested In Drug Bust In Canada , Lakhbir Singh Landa, Ar-TeluguStop.com

ఈ నేపథ్యంలో కెనడాలో వుంటూ పంజాబ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న గ్యాంగ్‌స్టర్‌లను పట్టుకునేందుకు తమకు సహకరించాలంటూ ఇటీవల కెనడా ప్రభుత్వాన్ని కోరారు సీఎం భగవంత్ మాన్.ఇప్పటికే పలువురు గ్యాంగ్‌స్టర్‌లపై పంజాబ్ ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో పాటు అప్పగింతపై కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూనే వున్నారు.

లఖ్‌బీర్ సింగ్ లాండా, అర్ష్ ధల్లా, గోల్డీ బ్రార్, రామన్ జడ్జి, రింకు రంధావా, బాబా డల్లా, సుఖా దునేకే ఇలా పేరు మోసిన గ్యాంగ్‌స్టర్లంతా కెనడాలోనే వున్నారు.

అసలు పంజాబీ గ్యాంగ్‌స్టర్లు కెనడాను అడ్డాగా చేసుకోవడానికి కారణమేంటనేది ఒకసారి పరిశీలిస్తే.

పోలీసులు చెబుతున్న దానిని బట్టి నేరస్తుల అప్పగింత ప్రక్రియకు కెనడా ప్రభుత్వం నుంచి భారత్‌కు సరైన సహకారం లేకపోవడమేనని తెలుస్తోంది.అయితే ఈ గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు కారణంగా కెనడాలోనూ శాంతి భద్రతల సమస్యలు ఏర్పడుతున్నాయి.

ఇటీవల వాంకోవర్‌లో జరిగిన గ్యాంగ్‌వార్‌లో గ్యాంగ్‌స్టర్ మణీందర్ ధాలివాల్, అతని స్నేహితుడు సతీందర్ గిల్‌లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Telugu Indianorigin, Arsh Dhalla, Baba Dhalla, Canada, Cm Bhagwant, Goldie Brar,

తాజాగా డ్రగ్స్ దందా సాగిస్తున్న ముఠా గుట్టును టొరంటో పోలీసులు రట్టు చేశారు.ఈ గ్యాంగ్ సభ్యులకు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు వున్నట్లు పోలీసులు చెబుతున్నారు.అరెస్ట్ చేసిన ఆరుగురిలో ముగ్గురు పంజాబీ సంతతి వ్యక్తులే కావడం గమనార్హం.

ఈ సందర్భంగా 25 మిలియన్ డాలర్ల విలువైన మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులను బ్రాంప్టన్‌కు చెందిన జస్ప్రీత్ సింగ్ (28), మిస్సిస్సాగాకు చెందిన రవీందర్ బొపరాయ్ (27), కాలెడాన్‌కు చెందిన గురుదీప్ గఖాల్ (38)లుగా గుర్తించారు.

ఈ ముఠాపై 11 నెలల పాటు నిఘా పెట్టిన పీల్ రీజనల్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.అలాగే ఈ గ్యాంగ్ సభ్యులు అమెరికా నుంచి నేరుగా పీల్, గ్రేటర్ టొరంటో పరిసర ప్రాంతాలకు డ్రగ్స్‌ను రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube