పసుపు దంతాలను పసుపుతోనే ఎలా వదిలించుకోవాలో తెలుసా?

సాధారణంగా కొందరికి దంతాలు ముత్యాల మాదిరి మెరిసిపోతూ కనిపిస్తుంటాయి.అలాంటి వారు నవ్వుతూ ఉంటే మరింత అందంగా కనిపిస్తూ ఉంటారు.

 Do You Know How To Get Rid Of Yellow Teeth With Turmeric Yellow Teeth, Turmeric-TeluguStop.com

కానీ కొందరి దంతాలు( teeth ) మాత్రం గార పట్టి పసుపు రంగులో ఉంటాయి.ఇలాంటివారు చాలా మద‌న పడుతుంటారు.

నలుగురితో మాట్లాడటానికి అసలు అంగీకరించారు.అలాగే నలుగురిలో నవ్వేందుకు ఎంతో అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.

తమ దంతాలు చూసి చుట్టూ ఉన్నవారు ఎక్కడ హేళన చేస్తారో అని ప్రతిక్షణం భయపడుతుంటారు.ఈ క్రమంలోనే పసుపు దంతాలను వదిలించుకోవడం కోసం రకరకాల టూత్‌ పేస్టులను వాడుతుంటారు.

అయిన స‌రే ఎలాంటి ఫలితం లేకుంటే ఏం చేయాలో అర్థం కాక సతమతం అయిపోతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.ఎందుకంటే పసుపు దంతాలను పసుపుతోనే వదిలించుకోవచ్చు.

అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె మరియు పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ( cinnamon powder )పావు టేబుల్ స్పూన్ ఉప్పు( salt ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని టూత్ పేస్ట్( Tooth paste ) సహాయంతో దంతాలకు అప్లై చేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోముకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా దంతాలు మరియు నోటిని క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా కనుక చేస్తే గార పట్టి పసుపు రంగులోకి మారిన దంతాలు కేవలం కొద్ది రోజుల్లోనే ముత్యాల మాదిరి తెల్లగా మెరుస్తాయి.

పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి సమస్యలు దూరం అవుతాయి.దంతాలు ఆరోగ్యంగా దృఢంగా మారతాయి.కాబట్టి ఎవరైతే పసుపు దంతాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.దంతాలను తెల్లగా మెరిపించుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube