టిడిపి నేత చింతకాయల విజయ్ కేసులో సిఐడిపై ఏపి హైకోర్టు సీరియస్ అయింది.హైదరాబాద్ లోని ఇంటికి వెళ్లి పిల్లలను విచారించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది, ప్రతీసారి హైరదాబాద్ వెళ్లి ఆ కుటుంబాన్ని ఎందుకు వేధిస్తున్నారని కోర్టు అడిగింది.41(ఎ) నోటీసులో ఉన్న అంశాలు అనుమానాస్పదంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.41(ఎ) లో కొన్ని అంశాల ను తొలగించాలంది.ఆరోపణలకు, సిఐడి పొందుపర్చిన అంశాలను సంబందం లేకుండా ఉన్నాయని అన్నారు.విచారించాల్సి వస్తే లాయర్ సమక్షంలో విచారించాలని కోర్టు తెలిపింది.ఈలోపు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సిఐడికి ఆదేశాలు జారీ చేశారు.తదుపరి విచారణ ను ఈనెల 31కు వాయిదా వేసింది.
తాజా వార్తలు