నటుడిగా, రచయితగా, దర్శకునిగా, రాజకీయ నేతగా పోసాని కృష్ణమురళి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.పోసాని కృష్ణమురళికి ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు కొంతమేర తగ్గాయనే సంగతి తెలిసిందే.
పోసాని కృష్ణమురళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో శ్రావణ మాసం సినిమా కూడా ఒకటి.దర్శకుడు చంద్ర సిద్దార్థ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
శ్రావణమాసం సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడంతో పోసాని కృష్ణమురళి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఇల్లును అమ్మేశారని సమాచారం.హరికృష్ణ, కృష్ణ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.
శ్రావణమాసం సినిమాకు హెల్పింగ్ గా ఉండాలని పోసాని కృష్ణమురళి నన్ను కొరారని ఆయన చెప్పుకొచ్చారు.నేను హెల్పింగ్ గా ఉన్నానని సినిమా విడుదలై ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుందని ఆయన కామెంట్లు చేశారు.
ఆ సినిమా వల్ల ఇల్లు అమ్ముకున్న పోసాని కృష్ణమురళి ఆ తర్వాత ఆపరేషన్ దుర్యోధన సినిమాకు దర్శకత్వం వహించి సక్సెస్ సాధించారని చంద్రసిద్దార్థ్ కామెంట్లు చేశారు.చంద్రసిద్దార్థ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పోసాని కృష్ణమురళి ప్రస్తుతం ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నారు.ఈ రీజన్ వల్లే ఆయనకు సినిమా ఆఫర్లు తగ్గాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
పోసాని కృష్ణమురళి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.పోసాని కృష్ణమురళి పరిమితంగానే రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.పోసాని తన సినీ కెరీర్ లో మరెన్నో సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పోసాని కృష్ణమురళి కథ అందించిన సినిమాలలో సైతం మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.