మంచు విష్ణు. ఈయన గత కొన్ని రోజులుగా సరైన హిట్ లేక రేస్ లో వెనుకబడి పోతున్నాడు.
వరుసగా సినిమాలు చేస్తున్న సరైన సక్సెస్ అయితే రావడం లేదు.దీంతో ప్రేక్షకులు మంచు హీరోలను మర్చిపోతున్నారు.
మంచు విష్ణు చివరగా మోసగాళ్లు సినిమాతో వచ్చి ప్లాప్ అందుకున్నాడు.ఈ సినిమా కూడా ఎన్నో అంచనాలు మధ్య రిలీజ్ అయినా హిట్ అవ్వక పోవడంతో మళ్ళీ అదే పొజిషన్ లో ఉన్నాడు.
ఈ సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో ఈయన ఢీలా పడిపోయాడు.అందుకే ఈసారి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు.ఈసారి అయినా ప్లాప్ కాకుండా విజయం అందుకోవాలని మంచు విష్ణు చాలా కష్ట పడుతున్నాడు.ఈ క్రమంలోనే ఈయన ప్రెజెంట్ జిన్నా సినిమా చేసి రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యాడు.
ఈ సినిమాతో అయినా మంచి హిట్ కొట్టాలని విష్ణు ముందు నుండే ఈ సినిమా కోసం భారీ ప్రొమోషన్స్ చేస్తున్నాడు.
ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు పాత్రలో విష్ణు నటిస్తున్నాడు.
ఇందులో పాయల్ రాజ్ పుత్ తో పాటు మరొక హాట్ బ్యూటీ సన్నీ లియోన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు వరుస ప్రొమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.అయితే తాజాగా ఈ సినిమ సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు అఫిషియల్ గా మేకర్స్ తెలిపారు.
సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ అందించినట్టు తెలుస్తుంది.మరి రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలా ఆకట్టు కుంటుందో చూడాలి.ఇక మంచు విష్ణు 19వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా కోన వెంకట్ ఈ సినిమాకు కథ – స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.
మంచు అవ్రమ్ భక్త సమర్పణలో ఏవీఏ ఎంటెర్టాన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.