ఆ రీజన్ వల్లే సినిమాలు చేయడం లేదు.. నటుడు అజయ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నటుడు అజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సినిమాలలో విలన్ పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అజయ్.

 Actor Ajay Share About His Movie Career And Personal Life Latest Interviewajay-TeluguStop.com

అంతేకాకుండా సింహాన్నిలో నటించి హీరోలకు సమానమైన ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.తెలుగు లో ఒక్కడు,విక్రమార్కుడు, సై, దేశ ముదురు, ఛ‌త్ర‌ప‌తి వంటి ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు అజయ్.

అయితే ఒకప్పుడు వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన అజయ్ ఈ మధ్యకాలంలో సినిమాలలో అంతగా కనిపించడం లేదు.

సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన అజయ్ దిక్కులు చూడకు రామయ్య సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు.

ఇకపోతే ప్రస్తుతం అజయ్ అడపాదడపా సినిమాలలో నటిస్తున్నాడు.కాగా అజయ్ సినీ ఇండస్ట్రీకి ఎంత ఇచ్చి 22 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలోనే ఎన్నో విషయాల గురించి పంచుకున్నారు అజయ్.ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ ఈమధ్య కాలంలో సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి గల కారణం తనకు తగ్గ పాత్రలు రావడం లేదని అందుకే గ్యాప్ వచ్చిందని తెలిపాడు.

అలాగే నేను ఎప్పుడూ పాత్రకు ఆదాయం ఉన్న చిత్రాలలోనే నటిస్తాను.నేను సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 22 ఏళ్ళు అయింది.

Telugu Ajay, Career, Dikkuluchoodaku, Indraja, Nagarya, Tollywood-Movie

ఈ 22 ఏళ్ళు కూడా ఆ విధంగానే చేశాను.ఇక ముందు ముందు కూడా అదే విధంగా పాత్రలు నచ్చితేనే చేస్తాను అని తెలిపాడు అజయ్.ఆ తర్వాత విలన్‌ గా నటించడంపై స్పందిస్తూ.శ్రీ మహాలక్ష్మి మూవీ సమయంలో చోటు చేసుకున్న ఓ సంఘటనని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.కల్యాణ్‌ రామ్‌, కాజల్‌ అగర్వాల్‌,లక్ష్మీ కల్యాణం సినిమా సమయంలో ఒక సంఘటన జరిగింది.అది నాకు ఇప్పటికి గుర్తు ఉంది.

ఈ సినిమాలో ఓ రేప్‌ సీన్‌ ఉంది.దానికోసం ఓ మోడల్‌ను తీసుకొచ్చారు.

అయితే ఆమెకు అది రేప్‌ సీన్ అనే విషయం చెప్పలేదు.నేను వెళ్లి చేయిపట్టుకోగానే ఆమె గట్టిగా ఏడ్చేసింది.

దాంతో నేను డైరెక్టర్‌కి ఆ సీన్‌ చేయలేను అని చెప్పాను అని తెలిపాడట అజయ్.కాగా తనకు నచ్చిన పాత్రలు రాకపోతే సినిమా లకి శాశ్వతంగా గుడ్‌ బై చెప్పేస్తాను అని తెలిపాడు అజయ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube