హంగేరియన్ మోటార్‌సైకిల్స్ తయారీ కంపెనీ ‘కీవే’ తాజాగా ఇండియాలో ‘కీవే ఎస్ఆర్125’ బైక్ లాంఛ్ చేసింది.దీని ధరను కేవలం రూ.1,19,000 (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది.గ్లోసీ రెడ్, గ్లోసీ బ్లాక్, గ్లోసీ వైట్ కలర్స్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో రిలీజ్ అయిన ఈ బైక్ ధర అనేది కలర్ ఆప్షన్స్ బట్టి మారుతుంటుంది.దీనిని కొనాలనుకునేవారు రూ.1,000 పే చేసి www.keeway-india.com వెబ్‌సైట్‌లో లేదా డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చు.దీనిని ఇప్పుడు బుక్ చేసుకుంటే ఈ నెల చివరి నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.ప్రస్తుతం ఈ బైక్‌ను అన్ని అథారైజ్డ్ బెనెల్లీ డీలర్‌షిప్‌లలో టెస్ట్ రైడ్ చేసుకోవచ్చు.
కీవే ఎస్ఆర్125 మోడర్న్ రెట్రో క్లాసిక్ డిజైన్‌లో అందుబాటులోకి వచ్చి అందర్నీ ఆకట్టుకుంటోంది.రౌండ్ హెడ్ లైట్, ఎల్ఈడీ డీఆర్ఎల్, కలర్ డిజిటల్ డిస్‌ప్లే వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇందులో అందించారు.
ఇక ఇంజన్ విషయానికి వస్తే.కీవే ఎస్ఆర్125 బైక్‌లో సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, 125సీసీ ఇంజన్ ఆఫర్ చేశారు.ఈ ఇంజన్ 9.7 హెచ్‌పీ పవర్, 8.2 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని కంపెనీ తెలిపింది.దాదాపు ఇదే ధరతో వస్తున్న హోండా షైన్ దీని కంటే ఎక్కువ పవర్ తో పాటు టార్క్ కూడా ప్రొడ్యూస్ చేస్తోంది.
కొనుగోలుదారులు ఈ విషయాన్ని గమనించాలి.
ఈ బైక్ కర్బ్ వెయిట్ 120 కేజీల ఉంటుంది కాబట్టి దీనిని సిటీలో ఈజీగా రైడ్ చేయవచ్చు.ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 14.5 లీటర్లు కాగా దీని సీట్ హైట్ 780మిమీ.సీట్ హైట్ దాదాపు స్పెండర్ ప్లస్ అంత ఉంటుంది కాబట్టి షాట్ రైడర్స్ కూడా దీనిని ఈజీగా నడపవచ్చు.ఈ కొత్త బైక్ ఫ్రంట్ సైడ్ 300 మిమీ డిస్క్ బ్రేక్, బ్యాక్‌సైడ్ 210 మిమీ డిస్క్ బ్రేక్‌తో వస్తుంది.
గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిమీ కాగా స్పీడ్ బ్రేకర్లు బండికి కింద తగులుతాయని భయ పడక్కర్లేదు.ఇక ఒక లీటర్‌కి ఎంత మైలేజ్ వస్తుందనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు.