నల్లగొండ జిల్లా:టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వర్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ పరిధిలో 25 వేల బోగస్ ఓట్లు ఆన్లైన్ లో నమోదు చేశారని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్,కాంగ్రేస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి సంచలన ఆరోపణ చేశారు.శుక్రవారం చండూర్ మండలం ఇడుకుడలోని పాల్వాయి స్రవంతి ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో కొత్త ఓట్ల విషయంలో అనేక అవకతకలు జరుగుతున్నవని,6 నెలల్లో 25 వేల ఓట్లు నమోదు చేశారని,అవన్నీ బోగస్ ఓట్లేనని అన్నారు.
బోగస్ ఓట్ల నమోదుపై రిటర్నింగ్ అధికారి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ నెల 9 నుండి 14 వరకు మునుగోడు నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటించనున్నారని,చౌటుప్పల్ నుండి పర్యటన మొదలవుతుందని తెలిపారు.