జమున అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వచ్చి సెటిల్ అవుతుందో రోజులవి.ఇంకా అనేక సినిమాలో నటిస్తున్న సమయంలో ఇండస్ట్రీతో మంచి స్తంభంధాలు కలిగి ఉండేది అంతేకాదు తనతో నటిస్తున్న ఓ కుర్ర హీరోలతో ప్రేమలో పడింది అని కూడా అందరూ చెప్పుకునేవారు.
అంతేకాదు ఆ హీరోనీ జమున పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుందట.అయితే ఆమే ప్రేమ మత్తును వదిలించారు నటుడు ఎస్వీఆర్.
మరి ఆమె ప్రేమ, పెళ్లి అలాగే ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఓవైపు గుండమ్మ కథ సినిమా షూటింగ్ జరుగుతుంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్, అక్కినేని, జమున, సావిత్రి, ఎస్.వి.రంగారావు, సూర్యకాంతమ్మ మరియు తదితరులు నటించారు.ఇక ఎస్విఆర్ కి ఉన్న తాగుడు అలవాటు గురించి మనందరికీ తెలిసిందే.
ఓ రోజు పీకల వరకు తాగిన ఎస్ వి రంగారావు జమున ఉంటున్న గది తలుపు తట్టారట.రోజు జరిగిన సంఘటనని ఇప్పటికి గుర్తు చేసుకుంటూ ఉంటారు జమునమ్మ.
తెల్లవార్లు ఆమెను కూర్చోబెట్టి జీవితం గురించిన అనేక విషయాలను అలాగే జీవితం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జమునకి చెప్తూ వస్తున్నారట ఎస్పీ రంగారావు.జీవితంలో ఎలా మెలగాలి ఎవరితో ఉండాలి అనే విషయంపై జమునకు సూచనలు చేస్తున్నారు.
కానీ ఇదంతా జరుగుతున్న కొద్ది జమునకు చిరాకు పెరిగిపోతూ వస్తుంది.అప్పటికే ఉదయం 5 అవుతుంది కానీ ఆయనేమో గది వదిలి వెళ్లడం లేదు.

ఇక కాసేపటికి మెల్లిగా లేచి వెళ్ళబోతూ ‘ఓ పిల్ల ఒక కుర్ర వెధవతో నీ యవ్వారం గురించి అందరూ చెప్పుకుంటున్నారు నేను కూడా విన్నా.అతడు అందరూ ఎన్టీఆర్ అవుతారని చెప్పుకుంటున్నారు కానీ వాడు మరో తాగుబోతు ఎస్విఆర్ అవుతాడు జాగ్రత్తగా ఉండు’ అని చెప్పి వెళ్లిపోయారు.అప్పుడు జమునకు జ్ఞానోదయం అయ్యింది ఆ కుర్ర హీరో ఎవరో బయటకు చెప్పకపోయినా అతడుకున్న మందు అలవాటు గురించి గుర్తొచ్చింది బలహీనతగా మారుతుందని ఆమె గ్రహించి అతనితో పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకుంది అతడు ఎవరో కాదు హీరో హరినాథ్.ఆ తర్వాత కాలంలో అతడు మాతకం బానిసై సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోవడమే కాదు ఈ లోకం చేసే శాశ్వతంగా వెళ్లిపోయారు.
ఆనాడు ఎస్విఆర్ జాగ్రత్తలు చెప్పి ఉండకపోతే ఆమె జీవితం కూడా నాశనం అయ్యేదని ఆమె ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటారు.