తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి సెటైర్లు వేశారు.మునుగోడు ఉపఎన్నిక సర్వేలో బీజేపీ మూడో స్థానంలో ఉందని సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయన్నారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ వెనకడుగు వేస్తోందని ఎద్దేవా చేశారు.రాజీనామా తర్వాతే మునుగోడుకు ఉపఎన్నిక అని మాట్లాడిన కోమటిరెడ్డి ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తాయని చెపుతుండటం హాస్యాస్పదం ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యనించారు.కేసీఆర్ పర్యటనలో భాగంగా అమరులు, రైతుల కుటుంబాలను పరామర్శిస్తుంటే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
జవాన్ల త్యాగాలను సైతం గుర్తించలేని గొప్ప దేశ భక్తులు ప్రతిపక్ష పార్టీ నేతలు అని దుయ్యబట్టారు.