అనంతపురం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ డిస్మిస్ వ్యవహారం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.ఎస్పీ ఫక్కీరప్ప, ఏఆర్ అడిషనల్ ఎస్పీ మహబూబ్ భాషాపై అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ప్రకాశ్ అధికారులపై మంగళవారం టూ టౌన్లో ఫిర్యాదు చేశారు.తప్పుడు రిపోర్ట్ ఇచ్చి దళితుడైన తన ఉద్యోగం పోయేందుకు కారణమయ్యారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కానిస్టేబుల్ ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదుపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రకాశ్ ఫిర్యాదుపై ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు, అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అనంతపురం రేంజ్ డీఐజీ పక్క జిల్లాలకు చెందిన వ్యక్తులను విచారణాధికారిగా నియమించి కేసును విచారణ చేయిస్తారని పోలీసులు తెలిపారు.