మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.మెగా ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టి తన నటనతో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
అతి తక్కువ సమయంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఈయన తొలిసారిగా 2014లో పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
ఈ సినిమా తనకు మంచి సక్సెస్ ఇవ్వడమే కాకుండా ఉత్తమ నటుడుగా కూడా అవార్డు సొంతం చేసుకున్నాడు.ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో నటించాడు.
ఇక కొన్ని సినిమాలు తనకు మంచి సక్సెస్ ను ఇవ్వగా మరికొన్ని సినిమాలు తనకు నిరాశ పరిచాయి.ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ కొన్ని రోజుల కిందట హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి పై తన స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తుండగా బైక్ స్కిడ్ అవ్వడంతో అక్కడికక్కడే కిందపడిపోయాడు.
దాంతో అతడి ముఖానికి, ఛాతికి తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే అక్కడున్న సమీప ఆస్పత్రిలో చేర్చారు.ఆ తర్వాత అపోలో హాస్పిటల్ కి చేర్చగా దాదాపు నెల రోజులు ఎక్కువగానే హాస్పిటల్ లోనే ఉన్నాడు.
ఇక ఈమధ్య సాయి ధరమ్ తేజ్ కోలుకున్న సంగతి తెలిసిందే.ఇక ఇటీవల ఈయన తను నటించబోయే సినిమాను కూడా ప్రారంభించాడు.
గతంలో తాను నటించిన రిపబ్లిక్ సినిమా కూడా విడుదలై మంచి సక్సెస్ ను అందించింది.ఇక ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ మరిన్ని అవకాశాలు అందుకోవటంతోనే ప్రస్తుతం ఆ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
ఇక ఈ మధ్య సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి కూడా హాట్ టాపిక్ గా మారింది.తను తనతో నటించిన మరో హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లు త్వరలో వీరు పెళ్లి బంధం తో ఒకటి కానున్నట్లు బాగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదంతా పక్కన పెడితే తాజాగా రంగ రంగ వైభవంగా సినిమా ఈవెంట్ లో సాయి ధరంతేజ్ పాల్గొని కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టాడు.

ప్రమాదం జరిగిన సమయంలో తను బాగా తాగి ఉన్నాడని ఆమధ్య బాగా వార్తలు వచ్చింది సంగతి తెలిసిందే.దీంతో ఆ విషయం గురించి స్పందిస్తూ.తాను 90 ఎంఎల్ వేయలేదని.
తనకసలు మద్యం అలవాటే లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు.‘నిజం చెబుతున్నా.
’ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు.నా తమ్ముడు బాగా నటించాడు ఈ సినిమాలో.
వాడ్ని ఆశీర్వదించండి.’ అంటూ అభిమానుల్ని కోరాడు సాయి ధరమ్ తేజ్.
ఇక ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చేతులెత్తి నమస్కరించి మరీ చెప్పాడు.ఇక తన ప్రాణాల్ని కాపాడింది హెల్మెట్.
అంటూ ఆ అనుభవంతో చెబుతున్నా.హెల్మెట్ ధరించడం మర్చిపోవద్దు అని సాయి ధరమ్ తేజ్ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.