కరోనా మహమ్మారి రావడంతో థియేటర్లన్నీ మూతపడ్డాయి.ఇలా థియేటర్లన్ని మూతపడటంతో ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడి సినిమాలను, వెబ్ సిరీస్ లను ఓటీటీలో చూస్తూ పూర్తిగా ఓటీటీలకు అలవాటు పడ్డారు.
ఈ క్రమంలోనే కరోనా తగ్గి థియేటర్లు ఓపెన్ అయినప్పటికీ ప్రేక్షకులు పెద్దగా థియేటర్ కు వెళ్లి సినిమాలను చూడటానికి ఇష్టపడటం లేదు.అదేవిధంగా థియేటర్లో విడుదలైన సినిమా మూడు లేదా నాలుగు వారాలకే ఓటీటీలో ప్రసారం కావడం చేత ప్రేక్షకులు పూర్తిగా థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం మానేశారు.
ఈ విధంగా ప్రేక్షకులు థియేటర్ కి రాకపోవడంతో సినీ నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని భావించి ఇదిలాగే కొనసాగితే రానున్న రోజులలో థియేటర్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని భావించిన నిర్మాత మండలి సమావేశమై సినిమా థియేటర్లో విడుదలైన 50 రోజులకు మాత్రమే ఓటీటీలలో ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ విధంగా టాలీవుడ్ నిర్మాతలు ఓటీటీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఓటీటీ సంస్థలు సైతం టాలీవుడ్ నిర్మాతలకు గట్టి షాక్ ఇచ్చాయి.

ఈ క్రమంలోనే సినిమా థియేటర్ లోవిడుదలయ్యి ఎంత ఆలస్యంగా డిజిటల్ మీడియాలో ప్రసారం అయితే డబ్బులు కూడా అంతే తక్కువగా చెల్లించబోతున్నట్లు వెల్లడించారు.ఒక సినిమా ఓటీటీలలో ఒక గంట ప్రచారం అయితే కేవలం మూడు రూపాయలు చెల్లిస్తామని,ఇలా ఎన్ని గంటల పాటు ఆ సినిమా స్ట్రీమింగ్ అయితే అన్ని మూడు రూపాయలు జమ చేస్తామని వెల్లడించారు.ఈ క్రమంలోనే 10 లక్షల మంది రెండు గంటల సినిమాని పూర్తిగా చూస్తే వారి ఖాతాలో 60 లక్షల జమవుతుందని ఓటీటీల నిర్వాహకుల పేర్కొన్నారు.ఈ విధంగా ఈ ధరలను మీడియం రేంజ్ సినిమాలకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక భారీ బడ్జెట్ సినిమాలకు సైతం ఇదే తరహాలో ఉండవచ్చని తెలుస్తోంది.ఏది ఏమైనా సినిమాల విషయంలో టాలీవుడ్ నిర్మాతలు తీసుకున్న నిర్ణయానికి ఓటీటీ యాజమాన్యం తమదైన శైలిలో పంచ్ ఇచ్చిందని తెలుస్తుంది.
సినిమా ఓటీటీలకు ఎంత ఆలస్యంగా వస్తే అంత తక్కువ డబ్బులు ఇవ్వబోతున్నట్లు సమాచారం మరి ఈ విషయంపై టాలీవుడ్ నిర్మాతలు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.