దివంగత నేత ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు హస్తగతం చేసుకున్నారని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ఆరోపించారు.ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆమె ఆకాంక్షించారు.
పాలిటిక్స్ లోకి వచ్చాక జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్వాధీనం చేసుకోవాలని కోరారు.అనంతరం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
టీడీపీ ప్రభుత్వం విద్యాశాఖను నిర్లక్ష్యం చేసిందని, దీని కారణంగా 30 వేల స్కూళ్లు మూతపడ్డాయని విమర్శించారు.సీఎం జగన్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని ఆమె కొనియాడారు.
పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్న ఘనత జగన్ కే దక్కుతుందన్నారు.