యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా 1996వ సంవత్సరంలో తెరకెక్కిన చిత్రం భారతీయుడు.ఈ సినిమా అప్పట్లోకి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమా విడుదలైన పాతికేళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ఇప్పటికే ప్రారంభించినప్పటికీ ఈ సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారితో డైరెక్టర్ శంకర్ కి మనస్పర్ధలు రావడం చేత కొద్దిరోజుల పాటు ఈ సినిమా షూటింగ్ ఆపివేయడమే కాకుండా శంకర్ పై కేసు కూడా పెట్టారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ అంతటితో ఆగిపోయింది.అయితే చాలా కాలం తర్వాత తిరిగి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని చిత్ర బృందం పెద్ద ఎత్తున సన్నహాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా సెప్టెంబర్ 13వ తేదీ నుంచి చెన్నైలో చిత్రీకరణ జరుపుకోనుందని సమాచారం.ఇకపోతే ఈ సినిమాలో వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా షూటింగ్లో ఈమె పాల్గొంటూ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కేవలం కాజల్ మాత్రమే కాకుండా మరొక స్టార్ హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు ఈ సినిమాలో కేవలం కాజల్ మాత్రమే హీరోయిన్ గా నటించగా తాజాగా ఈ సినిమా గురించి వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో మరొక స్టార్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తున్నారని త్వరలోనే ఆమె కూడా షూటింగ్లో పాల్గొనబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.మరి రకుల్ ప్రీతిసింగ్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.ఇక ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించగా ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.