ముక్కుసూటితనానికి, నీ స్వార్థపు మాటలదాడికి, ఎదుటివారు ఎంతటి వారైనా తన విమర్శనాస్త్రాల కు మరింత పదునుపెట్టే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో మునుపటిజోష్, ఫైర్ ఇప్పుడు తగ్గిపోయాయి అన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.వ్యూహాత్మకంగానే ఫైర్ తగ్గించాడా.? లేదా అన్నీ తెలిసివచ్చి సైలెంట్ గా ఉంటున్నాడా…? అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.
పవన్ లో కనిపించని మునుపటి ఫైర్ :
ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలో పవన్ కళ్యాణ్ తర్వాతనే ఎవరైనా. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యర్థులు ఎంత బలమైనవారైనా విమర్శనాస్త్రాలు కురిపిస్తాడు పవన్ కళ్యాణ్.తాను అనుకున్నది చేయడంలో, చెప్పడంలో ఏమాత్రం వెనక్కితగ్గడు అయన.తాను అనుకున్న మాటకోసం డబ్బులు, మద్యం పంచకుండా ఎన్నికలకు వెళ్లి రెండు చోట్ల ఓడిపోయిన ఘనత ఆయనకే సొంతం. ప్రత్యేక హోదా సమయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని మోడీని బహిరంగంగానే విమర్శించారు పవన్ కళ్యాణ్.
వైయస్ రాజశేఖర్ రెడ్డి లాంటి పవర్ ఫుల్ ముఖ్యమంత్రి అధికారంలో ఉండగా పంచలు ఊడదీసి కొడతా అన్న చరిత్ర పవన్ కళ్యాణ్ కు మాత్రమే సొంతం.ఇలాంటి వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ కి ఒక నికార్సైన, దమ్మున్న రాజకీయ నాయకుడు వచ్చాడని సంతోషించారు.

ప్రజల ఆశలు నీరుగారుస్తూ ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఉంటున్న విధానం ఎవరికినచ్చడం లేదు.ఉన్నట్టుండి ఏమైందో గానీ పవన్ కళ్యాణ్ లో నాటి జోష్, ఫైర్ పూర్తిగా తగ్గిపోయాయి.అప్పుడప్పుడు మాట్లాడటం తప్ప మిగిలిన సందర్భాల్లో ఆచితూచి మాట్లాడుతున్నాడు.దీంతో పవన్ అన్నా నాటి ఫైవ్ ఏమైందన్నా అన్న వాదనలు తెరమీదకు వస్తున్నాయి.
దీంతో ఆంధ్రప్రదేశ్ లో ముక్కుసూటిగా, ధైర్యంగా మాట్లాడే ఉన్న ఒక్క నేత కూడా లేకుండా పోయాడని ప్రజలు అనుకుంటున్నారు.పవన్ కళ్యాణ్ ఇలా పద్ధతిగా మాట్లాడడానికి కారణం అనుభవమా, రాజీపడడమా, అన్నది అర్థం కావడం లేదు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫైర్ తగ్గింది అనడానికి ఇటీవల జరుగుతున్న పరిణామాల ద్వారానే తెలుస్తుంది.