బుల్లితెర రియాలిటీ షోలలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న బిగ్ బాస్ షో సీజన్6 తెలుగు వచ్చే నెల నుంచి మొదలుకానుంది.స్టార్ మా ఛానల్ లో ఈ షో నాగార్జున హోస్ట్ గా ప్రసారం కానుండగా ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ పూర్తైందని తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్6 లో పాల్గొనే కంటెంట్లు వీళ్లేనంటూ పలువురు కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే వైరల్ అవుతున్న జాబితాలో ఉన్న కంటెస్టెంట్లు షోలో ఉంటారో లేదో కచ్చితంగా చెప్పలేము.
జబర్దస్త్ కొత్త యాంకర్ మంజూష అని గత కొంతకాలంగా ప్రచారం జరగగా రష్మీనే జబర్దస్త్ కు కూడా యాంకర్ గా కొనసాగనున్నారని నిన్నటి ఎపిసోడ్ తో క్లారిటీ వచ్చింది.అయితే యాంకర్ మంజూష బిగ్ బాస్ షోలో కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.
తెలుగులో పలు సినిమాలలో నటించి గుర్తింపును సొంతం చేసుకున్న ఆశా షైనీ కూడా బిగ్ బాస్ 6 కంటెంట్లలో ఉన్నారని సమాచారం.
హీరోయిన్ ప్రీతి అస్రానీ కూడా బిగ్ బాస్ సీజన్6 కంటెస్టెంట్లలో ఒకరని జోరుగా వినిపిస్తోంది.
ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న హీరోలలో సుమంత్ అశ్విన్ ఒకరు.సుమంత్ అశ్విన్ బిగ్ బాస్6 లో సందడి చేసే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతోంది.
సీరియల్ యాక్టర్ కౌశిక్, మాస్టర్ భరత్ పేర్లు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.

యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన కుషిత, ప్రముఖ ఆర్టిస్ట్ సంజన చౌదరి, న్యూస్ యాంకర్ పద్మిని, ట్రాన్స్ జెండర్ తన్మయి ఉన్నారని తెలుస్తోంది.ప్రేక్షకులకు పరిచయం ఉన్న కంటెస్టెంట్లతో పాటు సామాన్యులకు కూడా బిగ్ బాస్ షోలో ఛాన్స్ దక్కనుందని తెలుస్తోంది.బిగ్ బాస్ షో సీజన్6 రికార్డ్ స్థాయిలో రేటింగ్ ను సొంతం చేసుకుంటుందని బిగ్ బాస్ అభిమానులు భావిస్తుండటం గమనార్హం.