మరాఠి సినిమాతో తెరంగేట్రం చేసి బాలీవుడ్ లో సత్తా చాటుతున్న భామ మృనాల్ ఠాకూర్.ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో నటించిన సీతారామం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాలో సీత పాత్రలో మృనాల్ ఠాకూర్ నటించారు.ప్రచార చిత్రాల్లో చూస్తుంటే సినిమాలో ఆమె నటన అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తుంది.ఇంత గొప్ప టాలెంటెడ్ నటి రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి సినిమాలో నటించాల్సి ఉందట.అవును ప్రభాస్ బాహుబలిలో ఒక పాత్ర కోసం మృనాల్ ని అనుకున్నాడట రాజమౌళి.
ఇంతకీ ఆ సినిమాలో ఏ పాత్రకి మృనాల్ ని అనుకున్నారు అంటే శివగామి పాత్రకని తెలుస్తుంది.శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటించి మెప్పించారు.
అఫ్కోర్స్ ఆమె తప్ప ఆ పాత్రకి ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఎవరు ఇవ్వలేరని చెప్పొచ్చు.అయితే శివగామి పాత్రకి ముందు మృనాల్ ని అనుకున్నారట రాజమౌళి.
అయితే అప్పటికే ఆమె వేరే సినిమాల్లో కమిట్ అవడం వల్ల ఆ ఛాన్స్ మిస్ చేసుకుందని తెలుస్తుంది.ఒకవేళ బాహుబలి సినిమాలో శివగామిగా మృనాల్ చేసి ఉంటే ఆమెకి మరింత క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉండేది.

మృనాల్ టాలెంట్ కి మెచ్చే ఆమెకు సీతారామంలో ఛాన్స్ ఇచ్చారు.ఈ సినిమాతో ఆమె మొదటిసారి తెలుగు తెరకు పరిచయం అవుతుంది.తన తెలుగు లాంచింగ్ ఇంత గ్రాండ్ సినిమా అయినందుకు ఆమె చాలా సంతోషిస్తుంది.సీతారామం సినిమా ఓ అద్భుతమైన సినిమా అని.తన కెరియర్ లోనే ఈ సినిమా ఈ పాత్ర స్పెషల్ గా మిగిలిపోతాయని అంటుంది మృనాల్.సీతారామం హిట్ అయితే ఆమెకి తెలుగులో కూడా వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.
ఇప్పటికే స్టార్ హీరోల కన్ను మృనాల్ మీద పడ్డదని టాక్.