కొందరు తమ చిన్నతనంలోనే ఒక డ్రీమ్ పెట్టుకొని దానిని నెరవేర్చేందుకు వయసుకు మించిన పనులను చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తుంటారు.పేపర్ వేయడం, హోటల్ లో ఫుడ్ సర్వ్ చేయడం, ఇంకా రకరకాల పనిచేస్తూ ఇప్పటికీ మనకు ఎంతో మంది కనిపించారు.
అయితే ఇలాంటి వారిని ఆదుకునే వారు చాలా తక్కువే అని చెప్పాలి.తాజాగా ఒక అమెరికన్ మహిళ మాత్రం పెద్ద మనసు చేసుకుని ఎండలో పనిచేస్తున్న ఒక బాలుడికి ఆర్థిక సహాయం చేసింది.
ఈ బాలుడు తన సాకర్ టీమ్‌తో కలిసి పోర్చుగల్‌కు వెళ్లేందుకు డబ్బును సేకరించాలి అనుకున్నాడు.అందుకే ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా నిమ్మరసం అమ్మడం స్టార్ట్ చేసాడు.
అయితే ఈ చిన్న పిల్లాడు ఎండలో కష్టపడటం చూసి ఒక మహిళ చలించిపోయింది.అనంతరం నిమ్మరసం ఎంత అని అడిగితే అతడిని మూడు డాలర్లు అని చెప్పాడు.
తన తండ్రికి గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో ఉన్నట్లు కూడా పేర్కొన్నాడు.పోర్చుగల్‌కు వెళ్లేందుకు తన తండ్రి సగం వరకు డబ్బులను అడ్జస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపాడు.
అయితే ఈ విషయాలు తెలుసుకున్న ఆ మహిళ అతడికి చాలా డాలర్లను ఇచ్చి అతన్ని ఆశ్చర్యపరిచింది.
ఆ డబ్బులు చూడగానే అతను బాగా సంతోష పడ్డాడు.అనంతరం “నేను దీనిని నమ్మలేకపోతున్నా.ఈ డబ్బు అంతా నాకే కదా” అని ఆనందం వ్యక్తం చేశాడు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఈ పిల్లాడు సంకల్పాన్ని చూసి కూడా మెచ్చుకుంటున్నారు.
సహృదయంతో ఆ పిల్లాడికి సహాయపడిన మహిళకు కూడా ధన్యవాదాలు చెబుతున్నారు.ఈ బ్యూటిఫుల్ వీడియోని మీరు కూడా వీక్షించండి.