ప్రస్తుతం తెలుగు హీరోలకు ఎవరికీ అందనంత ఎత్తులో కొనసాగుతున్నాడు ప్రభాస్.బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.
హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రస్తుతం వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.ప్రభాస్ తో ఒక సినిమా చేసే ఛాన్స్ వస్తే చాలు అని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరూ నిర్మాతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.
అయితే హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా అటు ప్రభాస్ సినిమాలకు బిజినెస్ కూడా అదే రేంజిలో అవుతూ ఉండటం గమనార్హం.అప్పుడు తెలుగు హీరోల ను పట్టించుకోని బాలీవుడ్ నిర్మాతలు సైతం ప్రస్తుతం కథలతో ప్రభాస్ వెంట పడుతున్నారు అని చెప్పాలి.
అయితే ఇంత పెద్ద స్టార్ హీరోగా ఎదిగిన.పాన్ ఇండియా రేంజిలో పాపులారిటీ సంపాదించిన ప్రభాస్ మాత్రం టాలీవుడ్ డార్లింగ్ లాగే ఉన్నాడు అని చెప్పాలి.ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నది ప్రభాస్ ని చూస్తే అర్థమవుతుంది.ఎప్పుడూ తక్కువగా మాట్లాడుతూ అందరిని ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఇక అంతకంతకు అభిమానులు పెంచుకుంటూ పోతున్నాడు ప్రభాస్.
ఇలా ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరో గా మారిపోయాడు టాలీవుడ్ హీరో ప్రభాస్.అయితే ఒకానొక సమయంలో ప్రభాస్ తో సినిమా అనుకొని ఆ తర్వాత ప్రభాస్ ను సినిమా నుంచి తీసేశారు.

వెంకటేష్ హీరోగా ఆసిన్ హీరోయిన్గా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఘర్షణ సినిమా మంచి విజయం సాధించింది.అయితే ఈ సినిమాకు ముందుగా వెంకటేష్ కు బదులు ప్రభాస్ హీరోగా ఎంపిక చేశారట.పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు.కానీ ప్రభాస్కు తక్కువగా క్రేజ్ ఉందన్న కారణంతో డార్లింగ్ ని పక్కన పెట్టి వెంకటేష్ ను హీరోగా పెట్టి సినిమా తీశారు.
అయినప్పటికీ ఇవేవి పట్టించుకోకుండా ప్రభాస్ ఘర్షణ ఆడియో ఫంక్షన్ లో సందడి చేసాడు అన్న విషయం తెలిసిందే.