కొన్ని సినిమాలలో కొన్ని సన్నివేశాలు బాగా హైలైట్ గా నిలుస్తాయి.ఇక ఆ మూమెంట్స్ కోసమే ప్రేక్షకులు ప్రత్యేకంగా సినిమాకు వెళ్తుంటారు.
థియేటర్లో ఆ సన్నివేశాలు చూసినప్పుడు మాత్రం తెగ అరుపులతో సందడి చేస్తుంటారు.నిజానికి ఆ సీన్స్ సినిమాను మరో ఎత్తుకు చూపిస్తాయి.
అలా టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో ఓ స్థాయికి తీసుకెళ్లిన సూపర్ డూపర్ ఎలివేషన్స్ సీన్స్ కూడా ఉన్నాయి.ఇంతకూ ఆ సినిమాలంటే తెలుసుకుందాం.
అఖండ:
డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేసుకున్న సినిమా అఖండ. ఇందులో నందమూరి బాలయ్య, ప్రగ్యా జైస్వాల్ నటించారు.ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు.ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ లో బాలయ్య అఘోరగా విలన్ ను కొట్టేటప్పుడు అక్కడ ఉన్న ఎడ్ల బండి చక్రాన్ని పైకి ఎత్తినప్పుడు.
ఆయనను శివుడిగా చూపించారు.దీంతో ఆ సీన్ అక్కడ బాగా పండింది.
ఆర్ఆర్ఆర్:
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొంది బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.ఈ సినిమాలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ గా నటించారు.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సన్నివేశంలో మాత్రం తన ఎక్స్ప్రెషన్స్ తో బాగా ఫిదా చేశాడు.అందులో తను జంతువులతో ఫైట్ చేసినప్పుడు ఆ సీన్ మాత్రం బాగా పండింది.అంతేకాకుండా ఇందులో రామ్ చరణ్ కూడా తను అల్లూరి సీతారామరాజు లో కనిపించి అందులో ఇచ్చిన ఎలివేషన్స్ కూడా బాగా హైలైట్ గా మారింది
పుష్ప:
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మంచి బ్లాక్ బస్టర్ హిట్ తో విడుదలైన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించాడు.ఈయన సరసన ఇండియన్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.ఇక ఇందులో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే సమయంలో అవన్నీ ఒక డ్యామ్ లో వేసి ఆ డ్యామ్ ను ఆపిస్తాడు.
ఇక ఆ సీన్ కూడా బాగా హైలైట్ గా మారింది.
కేజిఎఫ్ 2:
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొంది మంచి సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేసుకున్న సినిమా ‘కేజిఎఫ్ 2’. ఇందులో కన్నడ హీరో యాష్ హీరోగా నటించాడు.ఇక ఈ సినిమాలో ఒక సన్నివేశం మాత్రం బాగా హైలైట్ గా నిలిచింది.
అదేంటంటే.పోలీస్ స్టేషన్ పైన యష్ గన్ తో పేల్చినప్పుడు ఆ సీన్ మాత్రం బాగా ఆకట్టుకుంది.
పైగా వేడిగా ఉన్న గన్ పై యష్ సిగరెట్ కాల్చడం స్టైల్ కూడా మరింత ఆకట్టుకుంది.
భీమ్లా నాయక్:
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ నటించి సక్సెస్ అందుకున్న సినిమా భీమ్లా నాయక్.ఈ సినిమా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.ఇక ఇందులో టైటిల్ పాటలో పవన్ కళ్యాణ్ నడిచే స్టైల్ ఆయన ఇచ్చే లుక్ మాత్రం బాగా ఆకట్టుకుంది.