ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెడతారనే వార్తల పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు.టైం పాస్ పాలిటిక్స్ చేయడంలో కేసీఆర్ దిట్ట.
రాష్ట్రాన్ని కులాల, మతాల పేరుతో విచ్చిన్నం చేసిన కేసీఆర్. ఆ నేరం వేరే వారిపై వేస్తున్నాడు.తెలంగాణ కు ఏమి చేయలేని కేసీఆర్.దేశానికి ఏం చేస్తారు.తెలంగాణను కుటుంబానికి అప్పగించి.అక్కడికి వెళ్తున్నారా.
తెలంగాణ ను మోసం చేసిన కేసీఆర్.దేశాన్ని మోసం చేయడానికి వెళ్తున్నారా.
దేశంలో కుటుంబ పాలన చేసే పార్టీలకు స్థానం లేదని కేసీఆర్ గ్రహించాలి.దేశం కుటుంబ పాలన ఉన్న పార్టీలు అంతమొందాయి.8 సంవత్సరాల మోడీ పాలన, 8 సంవత్సరాల కేసీఆర్ పాలన పై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నాం.
ఇక్కడ అవినీతి మాయమైన కుటుంబ పాలన సాగుతుంది.