ఒక్కోసారి మనం చేసే చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.ప్రముఖ రెస్టారెంట్ కంపెనీ డామినోస్ విషయంలో కూడా ఇదే జరిగింది.
ఉత్తరాఖండ్ రూడ్కీకి చెందిన ఓ వ్యక్తి, వెజ్ పిజ్జా ఆర్డర్ చేస్తే.నాన్ వెజ్ పిజ్జాను డెలివరీ చేశారని ప్రముఖ రెస్టారెంట్ కంపెనీ డామినోస్పై కేసు వేశాడు.
మొదట అతను ఈ విషయంపై పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించగా అక్కడ న్యాయం జరగకపోవడంతో.జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు.
దీంతో బాధితుడికి. రూ.9 లక్షల 65 వేల 918 పరిహారంగా చెల్లించాలని డామినోస్ను ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.
రూడ్కీలోని సాకేత్ ప్రాంతంలో నివాసముంటున్న శివాంగ్ మిత్తల్. 2020 అక్టోబర్ 26న రాత్రి ఆన్లైన్లో పిజ్జా టాకో(వెజ్ పిజ్జా), చాకో లావా కేక్ ఆర్డర్ చేశాడు.దీని విలువ రూ.918.ఆర్డర్ వచ్చాక దాన్ని విప్పి చూడగా అందులో నాన్ వెజ్ పిజ్జా ఉన్నట్లు అతను గుర్తించాడు.దీంతో అతడు వాంతులు చేసుకున్నాడు.
ఆరోగ్యం కూడా క్షీణించింది.వినియోగదారుడు, అతడి కుటుంబం మొత్తం శాకాహారులు.
మాంసాహారంతో తమ మతపర మనోభావాలు దెబ్బతిన్నట్లు స్థానిక గంగ్నహర్ రూడ్కీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధితుడు.అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.
జిల్లా వినియోగదారుల కమిషన్ ని ఆశ్రయించాడు.

ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.దీనిలో డామినోస్ కంపెనీ నిర్లక్ష్యంగా ఉన్నట్టు గుర్తించింది.వెజ్ పిజ్జా ఆర్డర్ చేశాక కూడా.
నాన్ వెజ్ పిజ్జా పంపినందున వినియోగదారులకు సరైన సేవలు అందించట్లేదని మండిపడింది.సదరు బాధితుడు పిజ్జాకు పెట్టిన రూ.918 ఖర్చుకు 6 శాతం వార్షిక వడ్డీ సహా ఆర్థిక పరిహారంగా రూ.4.5 లక్షలు, ఇతర పరిహారంగా రూ.5 లక్షలు మొత్తం రూ.9,65,918 నెలలోగా చెల్లించాలని ఆదేశించింది.