మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో మోస్ట్ అందగాడు ఎవరు అంటే వినిపించే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు.ఈయన ఫాలోయిన్ నే వేరు.
సౌత్ హీరోల్లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అంటే నమ్మాల్సిందే.ఇక ఇప్పుడు ఈయన నటించిన సర్కారు వారి పాట సినిమాతో మహేష్ బాబు రాబోతున్నాడు.
మహేష్ బాబు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటాడు.ఈయన సినిమాలంటే వైవిధ్యంగా ఉంటాయి.ప్రేక్షకులకు దగ్గరగా ఉండే కథలను మహేష్ ఎంచు కుంటాడు.ఈయన ఒక్కసారి కమిట్ అయితే వెంటనే సినిమా చేసుకుంటూ వెళ్ళిపోతాడు.
మధ్యలో ఆ సినిమాకు బ్రేకులు ఉండవు.అయితే సర్కారు సినిమా మాత్రం కరోనా కారణంగా ఇన్నాళ్ల సమయం తీసుకుంది.
ఇక ఈ సినిమా రేపు థియేటర్స్ లోకి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బాగా జరుగుతుంది.అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డులు బ్రేక్ చేస్తూ పోతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.
ఈ సినిమాకు విలేజ్ లలో కూడా సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.దీంతో రిలీజ్ రోజు టికెట్స్ సేల్స్ భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ఇప్పటి వరకు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నైజాం లో 7 కోట్ల గ్రాస్ రేంజ్ లో జరిగింది.ఇంకా బుకింగ్స్ జోరుగా కొనసాగుతుండడంతో ఈ సినిమా మరింత గ్రాస్ వచ్చే అవకాశం ఉంది.ఇక ఓవర్సీస్ లో సైతం మహేష్ సర్కారు వారి పాట రికార్డుల వేట మొదలు పెట్టింది.ఈ సినిమా అక్కడ ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ తో 635k డాలర్స్ సొంతం చేసుకుంది.
అక్కడ ఉన్న పోటీ మధ్య కూడా ఈ రేంజ్ లో బుకింగ్స్ జరగడం గ్రేట్ అనే చెప్పాలి.
ఇలా ఓవర్సీస్ లో 5 కోట్ల గ్రాస్ రేంజ్ లో బుకింగ్స్ జరిగాయి.
ఇలా రెండు చోట్ల కలిపి 12 కోట్ల గ్రాస్ ను అందుకుంది సర్కారు వారి పాట.మరి రిలీజ్ అయ్యి మొదటి రోజు బాక్సాఫీస్ లెక్కలు బయటకు వస్తే కానీ ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ బయటకు రావు.ఈ జోరు చూస్తుంటే భారీగానే గ్రాస్ వసూళ్లు వచ్చేలా కనిపిస్తుంది.