ఆచార్య సినిమాలో కాజల్ పాత్రను తీసేయడం ఒక విధంగా ఆమెను అవమానించడమే అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా నుంచి కాజల్ అగర్వాల్ ను తొలగించడానికి చెప్పిన కారణాలు కూడా సంతృప్తికరంగా లేవని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
కొందరు నెటిజన్లు కాజల్ వద్దు కానీ ఆచార్య మూవీలో ఐటెం సాంగ్ కావాలా అని ప్రశ్నిస్తున్నారు.
ఐటెం సాంగ్ చేస్తే ఆచార్య పాత్రపై మంచి అభిప్రాయం ఏర్పడుతుందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
అయితే నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొరటాల శివ స్పందించి తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు.ప్రేక్షకులలో మెగాస్టార్ చిరంజీవికి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చిరంజీవి సినిమా అనగానే ఫైట్లు, డ్యాన్స్ లను కోరుకుంటారని కొరటాల శివ చెప్పుకొచ్చారు.

చిరంజీవి ఇమేజ్, ఆయన పోషిస్తున్న పాత్రకు భంగం కలగకుండా సానా కష్టం పాటను క్రియేట్ చేశామని కొరటాల శివ కామెంట్లు చేశారు.కథకు ఈ పాట ఎలాంటి ఇబ్బంది కలిగించిందని ఆయన చెప్పుకొచ్చారు.ఆచార్య తోటి కామ్రేడ్ ఇంటికి పెళ్లికి వెళ్లిన సమయంలో ఈ పాట వస్తుందని ఆయన కామెంట్లు చేశారు.ఈ ఐటెం సాంగ్ లో రెజీనా డ్యాన్స్ చేయడం గమనార్హం.

ఈ పాటకు ప్రేక్షకుల నుంచి థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.ఈ పాటను చాలా గ్రాండ్ గా తెరకెక్కించారని ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా ద్వారా లభిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆచార్య బుకింగ్స్ ఆశాజనకంగా లేకపోవడం సినిమాకు ఒకింత మైనస్ అయినా సినిమా రిలీజైన తర్వాత పరిస్థితి మారుతుందని మెగా ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.ఫస్ట్ డే కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయిలో ఉండే ఛాన్స్ అయితే లేదు.