సోమవారం అంటే నిన్న పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ సందర్భంగా బ్యాటర్ శిఖర్ ధావన్ ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్‌పై మొత్తం 1029 పరుగులు నమోదు చేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన నంబర్ వన్ ఆటగాడిగా నిలిచాడు.తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ డేవిడ్ వార్నర్ ఉన్నారు.
ఈ జాబితాలో కోల్‌కతాపై 1018 స్కోరు చేసిన రోహిత్ సెకండ్ ప్లేస్ తో సరిపెట్టుకోగా, పంజాబ్‌పై వార్నర్ 1005 పరుగులు చేసి థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు.
ఇక శిఖర్ ధావన్ తాజాగా ఐపీఎల్‌లో 200వ మ్యాచ్ ఆడి ఏకంగా 6000 పరుగులు చేసి తన సత్తా చాటాడు.దీనితో ఐపీఎల్‌లో హైయెస్ట్ రన్స్ చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ తరువాత ప్లేస్ ని ధావన్ సొంతం చేసుకున్నాడు.207 మ్యాచ్‌ల్లో కోహ్లీ 6,402 పరుగులు చేయగా, శిఖర్ ధావన్ 200 మ్యాచ్‌ల్లో 6086 పరుగులు చేశాడు.ఆ తర్వాతి ప్లేసుల్లో రోహిత్ శర్మ (5764), వార్నర్ (5668) ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.నిన్న వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ధావన్ 9 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 88 పరుగులతో టాప్ స్కోరర్‌గా రాణించాడు.ఈ హాఫ్ సెంచరీతో హైయెస్ట్ హాఫ్ సెంచరీల లిస్టులో శిఖర్ ధావన్ సెకండ్ ప్లేస్ సంపాదించాడు.57 హాఫ్ సెంచరీలతో డేవిడ్ వార్నర్ ఫస్ట్ ప్లేసులో ఉండగా, శిఖర్ ధావన్ 48 హాఫ్ సెంచరీలతో సెకండ్ ప్లేసులో నిలిచాడు.