పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హీరోగా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.అయితే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ సాధించడానికి రేయింబవళ్లు కృషి చేస్తున్నారు.
సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ మొత్తాన్ని కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఖర్చు చేస్తున్నారు.పార్టీతో సంబంధం లేకుండా కష్టాల్లో ఉన్న కుటుంబాలను పవన్ కళ్యాణ్ ఆదుకుంటుకున్నారు.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.పవన్ తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసాలో పాల్గొన్నారు.
పవన్ ను చూడాలని లక్షల సంఖ్యలో అభిమానులు రాగా పోలీసులు అభిమానులను కంట్రోల్ చేయడానికి ఎంతో కష్టపడ్డారు.అయితే పవన్ స్టేజ్ పైకి వెళ్లే సమయంలో అభిమానులు పోటెత్తడంతో పోలీస్ అధికారి ఒకరు కింద పడిపోయారు.
ఈ విషయాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ వెంటనే పోలీస్ అధికారికి చేయి అందించడంతో పాటు జాగ్రత్తలు చెప్పారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
పవన్ సెలబ్రిటీ అయినా సామాన్యుల విషయంలో ఈ విధంగా వ్యవహరిస్తారు కాబట్టే ఆయన దేవుడు అయ్యారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.పవన్ మంచి మనస్సుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
మరోవైపు 3,000 కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఏకంగా 30 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం గమనార్హం.భారీస్థాయిలో ఆర్థిక సాయాన్ని ప్రకటించి పవన్ నెటిజన్లు సైతం ఆశ్చర్యపోయేలా చేశారు.సినిమాసినిమాకు పవన్ కళ్యాణ్ కు క్రేజ్ పెరుగుతుండగా పవన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.