సూపర్‌స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట‘ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూకుడు మీదున్న మహేష్ బాబు, అటు సూపర్ ఫామ్ లో వున్న దర్శకుడు పరశురామ్ కలయికలో వస్తున్న ఈ చిత్రం కు సంబధించిన ప్రమోషనల్ కంటెంట్ కు వస్తున్న స్పందన అంచనాలని ఇంకా భారీగా పెంచుతుంది.

 Mahesh Babu’s Sarkaru Vaari Paata, Releasing Worldwide Grandly On May 12th,-TeluguStop.com

చిత్ర యూనిట్ ప్రమోషన్ల జోరు కొనసాగిస్తుంది.తాజాగా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ మొత్తం పూర్తయింది.

హైదరాబాద్‌ లోని ఆర్‌ ఎఫ్‌ సిలో వేసిన భారీ సెట్‌లో మహేష్ బాబు, కీర్తి సురేష్, డ్యాన్సర్‌ లపై మాస్ సాంగ్ ని చిత్రీకరించారు.ఈ పాట చిత్రీకరణ పూర్తయింది.

దాంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది.సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మొదటి రెండు పాటలు, కళావతి, పెన్నీ.ఇప్పటికే చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి.మూడవ సింగిల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మూడో సింగల్ టైటిల్ సాంగ్ రేపు ఉదయం11:07 గంటలకు చిత్ర యూనిట్ విడుదల చేస్తుంది.ఇప్పటికే ఈ పాటకు సంబధించి విడుదల చేసిన పోస్టర్‌ లో మహేష్ బాబు పవర్ ఫుల్ గా కనిపించి అంచనాలు పెంచారు.కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఆర్ మధి సినిమాటోగ్రాఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.’సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

తారాగణం: మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube