విజయవాడ జీజీహెచ్ లో ఓ మానసిక వికలాంగురాలిపై జరిగిన సామూహిక అత్యాచారంపై వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని స్పందించారు.శాఖాపరంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని, ఆస్పత్రి సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని డీఎంఈని ఆదేశించారు.
విజయవాడ జీజీహెచ్ లో జరిగిన ఘటనపై శాఖాపరంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని డీఎంఈని ఆదేశించారు.ఆస్పత్రి సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
నిందితులు ఫాగింగ్ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించారు.వారిని వెంటనే విధుల నుంచి తొలగిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.