సూర్యాపేట జిల్లా మేళ్ళచెర్వులో శివరాత్రి సందర్బంగా శ్రీ స్వయంభూ లింగేశ్వర స్వామి వారిని మాజీ పీసీసీ అధ్యక్షుడు,నల్గొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు స్వామివారి దర్శనం చేసుకున్నారు.అలయాధికారులు ఉత్తమ్ దంపతులకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికి,వారిని ఆశీర్వదిస్తూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ:సంతోషాలతో,పాడి పంటలతో,అష్ట ఐశ్వర్యాలతో,ఆయురారోగ్యాలతో చిరకాలం ఉండాలని కోరారు.