రైల్వే భోగీల వెన‌కాల X అనే ప‌దం ఎందుకు ఉంటుందో తెలుసా..?

సాధారణంగా అందరూ ట్రైన్ లో ప్రయాణిస్తూనే ఉంటారు.ఆ ప్రయాణంలో ట్రైన్ చివరి భోగి వెనకాల పెద్దగా ఎక్స్ అనే సింబల్ రాసి ఉంటుంది.

 Do You Know Why There X Behind Railway Bogies-TeluguStop.com

దీన్ని ప్రయాణికులు అందరు గమనిస్తూ ఉంటారు కానీ చాలామందికి ఇలా ఎందుకు రాసి ఉంటుందొ అన్న విషయం మాత్రం తెలియదు.ఇప్పుడు మనం అలా రాసి ఉండడానికి కారణం ఏమిటో తెలుసుకుందాం.

ట్రైన్ చివరి భోగి మీద ఎక్స్ అనే అక్షరం తప్పనిసరిగా ఉండాలి.ఎందుకంటే మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే, ఏదైనా కారణం చేత భోగిలు విడిపోయి నట్లయితే స్టేషన్ లో ఉన్న అధికారులు గుర్తించడానికి ట్రైన్ చివరిన ఎక్స అనే అక్షరం మెన్షన్ చేస్తారు.

స్టేషన్ నుంచి ట్రైన్ బయలుదేరుతున్నప్పుడు రైల్వే స్టేషన్ లో పనిచేస్తున్న వ్యక్తి చివరి భోగి మీద ఎక్స్ అనే ఉందో లేదో గమనిస్తాడు.

ఒకవేళ ఎక్స్ అనే అక్షరం లేనట్లయితే ఆ వ్యక్తి వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇస్తాడు.

రైల్వే అధికారులు త్వరగా స్పందించి ప్రమాదవశాత్తు విడిపోయినట్లు గమనించి వెంటనే ఆ మార్గంలో వెళ్లే రైళ్లను ఆపివేసి ఎక్కడ భోగిలు విడిపోయాయో తెలుసుకుంటారు.

ఇక ట్రైన్ మీద ఎక్స్ అనే అక్షరం పగటి పూట మాత్రమే కనిపిస్తుంది.

ఇక రాత్రి సమయంలో ట్రైన్ అన్ని బోగీలతో వెళుతుంది అని గుర్తు ఉండడానికి ట్రైన్ చివరి భోగి మీద ఎక్స్ అనే గుర్తును ఒక చిన్న రెడ్ లైట్ లా మెన్షన్ చేస్తారు.ఇక రెడ్ లైట్ ప్రతి ఐదు సెకన్లకు ఒకసారి వెలుగుతూ ఆగుతుంది.

చివరి పెట్టె మీద వెలుగుతున్న రెడ్ లైట్ ని బట్టి ట్రైన్ అన్ని పెట్టెలతో కలిసి వెళుతుంది అని కన్ఫామ్ చేసుకుంటారు. ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

Do You Know Why There X Behind Railway Bogies Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube