క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ.ఈమె గురించి దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసే ఉంటుంది.
ఎందుకంటే ఇప్పటివరకు ఈమె చేసిన సినిమాలు అలాంటివి.కేవలం సినిమాల ద్వారానే కాదు కొన్ని కాంట్రవర్సీ ల ద్వారా కూడా హేమ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తోంది.
ఇకపోతే ఇప్పటికే లేడీ కమెడియన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఎంతో మంది అభిమానులనుఆకర్షించింది హేమ.ఇక ఎలాంటి కమీడియన్ సరసన నటించిన వారికి పర్ఫెక్ట్ జోడి అనిపిస్తూ ఉంటుంది.ముఖ్యంగా హాస్యబ్రహ్మ బ్రహ్మానందం హేమ జోడి అయితే ఒక్కసారి తెరమీద కనిపిస్తే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వుకుంటూ ఉంటారు.
ఇక ఇప్పటి వరకు వందల సినిమాల్లో నటించి టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది హేమ.ఇక వివాదాలు అంటారా.ఇటీవలే మా ఎలక్షన్స్ సమయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది హేమ.ఇప్పుడు ఇంతకీ హేమ గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అంటారా.సినీ సెలబ్రిటీల ఆస్తుల గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయం హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది.
ఇప్పుడు లేడీ కమెడియన్ హేమ ఎంత సంపాదించి అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది హేమ.మీకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి అంట కదా అంటూ అడిగిన ప్రశ్నకి.ఆసక్తికర సమాధానం చెప్పింది.
వందల కోట్ల ఆస్తులు ఏమీ లేవు కానీ ఉన్నంతలో మేం బాగా బ్రతికేందుకు ఆస్తులు బాగానే ఉన్నాయి అంటూ హేమ చెప్పింది.కానీ ఎంత ఆస్తులు ఉన్నాయి అన్న విషయం మాత్రం రివీల్ చేయలేదు.తన కూతురిని సెటిల్ చేసేంత సంపాదించానని.ఇంకా సంపాదిస్తూనే ఉన్నాను అంటూ హేమ చెప్పుకొచ్చింది.అదే సమయంలో తన కూతురికి గంజి అన్నం తినడం కూడా నేర్పించానని కష్టపడి పని చేయడం ఎలా అనే విషయాన్ని ఎప్పుడూ చెబుతూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది.అంతేకాకుండా తాను 18 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే ఇంట్లో తెలియకుండా రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నానని ఆ తర్వాత పెద్దల అంగీకారంతో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నా అంటూ లైఫ్ లో జరిగిన పలు విషయాలను పంచుకుంది హేమ.