బాలకృష్ణ హీరో గా రూపొందుతున్న 107వ సినిమా ఫస్ట్ లుక్ ను నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఈ సినిమాకు క్రాక్ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత ఈ సినిమా లో నటిస్తున్న నేపథ్యంలో అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాకు టైటిల్ ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.నేడు సినిమా నుండి ఫస్ట్ లుక్ రాబోతుంది అంటూ యూనిట్ సభ్యులు ప్రకటించిన నేపథ్యం లో టైటిల్ ని కూడా రివీల్ చేస్తారంటూ అంతా భావించారు.
ఇప్పటికే వీర సింహా రెడ్డి అనే టైటిల్ ని ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.అదే టైటిల్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంతా భావించారు.
కానీ వీర సింహా రెడ్డి సినిమా యొక్క టైటిల్ కాదని క్లారిటీ ఇస్తూ కేవలం ఫస్ట్ లుక్ ను మాత్రమే దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేయడం జరిగింది.ఇదే సమయంలో బాలకృష్ణ అభిమానులు దర్శకుడు గోపీచంద్ సినిమా టైటిల్ ని కూడా రివీల్ చేసి ఉంటే బాగుండేది అంటూ కామెంట్ చేస్తున్నారు.
సినిమా టైటిల్ ని ఉగాది సందర్భంగా రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.అసలు విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ఈ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.థమన్ ఈ సినిమా సంగీతాన్ని అందిస్తున్నాడు.
అఖండ ఎలా అయితే డిసెంబర్ లో విడుదల అయ్యిందో ఈ సినిమా ను కూడా అలాగే విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.