1.భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ వాయిదా
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంతాపంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ తెలిపింది.
2.గౌతంరెడ్డి నివాసానికి చంద్రబాబు జగన్
గుండెపోటుతో మరణించిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నివాసానికి టిడిపి అధినేత చంద్రబాబు, , వైయస్ షర్మిల వంటివారు నివాళులర్పించారు మరికొద్ది సేపట్లో ఏపీ సీఎం జగన్ కూడా గౌతమ్ రెడ్డి నివాసానికి చేరుకోనున్నారు.
3.ఐ.ఎన్.ఎస్ సుమిత్రా లో భారత రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విశాఖపట్నం లో జరుగుతున్న ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూలో పాల్గొన్నారు.
4.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 16,051 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
5.ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం
ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఎమ్మెల్సీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేశారు.
6.కెసిఆర్ ను ఓడించడమే లక్ష్యం : బీజేపీ
తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఓడించడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ నేత మురళీధర్ రావు అన్నారు.
7.కెసిఆర్ కు కేంద్ర మంత్రి లేఖ
తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు విద్యాసంస్థల్లో వెనుకబడిన తరగతుల వారికి 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు.
8.గౌతమ్ రెడ్డి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండ
ఈరోజు గుండెపోటుతో మరణించిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు.గౌతం రెడ్డి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
9.గౌతమ్ రెడ్డి మృతికి ఉప రాష్ట్రపతి సంతాపం
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు.
10.నేడు రెండు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు సంగారెడ్డి జిల్లాలో రెండు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు.
11.బహుజన రాజ్యం రావాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బహుజనులు బాగుపడాలంటే బహుజన రాజ్యం రావాలని అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
12.దిల్ షుక్ నగర్ బాంబు పేలుళ్లకు తొమ్మిదేళ్లు
దిల్ షుక్ నగర్ బాంబు పేలుళ్లకు నేటితో 9 ఏళ్లు పూర్తయ్యాయి.
13.మాతృభాషా దినోత్సవం
నేడు ప్రపంచ మాతృభాషా దినోత్సవం కావడంతో పలుచోట్ల మాతృ భాష కు సంబంధించిన కార్యక్రమాలు పలువురు భాషాభిమానులు చేపట్టారు.
14.నేడు ముద్రగడ తో బీజేపీ ఎంపీ భేటీ
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను ఈరోజు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి లోని ముద్రగడ నివాసంలో కలవనున్నారు.
15.50 వేల కోట్ల దోపిడీపై స్పందించాలి : రేవంత్ రెడ్డి
తెలంగాణలో జరుగుతున్న కోల్ స్కాం పై మౌనంగా ఉండటం ఏమిటని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు.
16.రెండు రోజులపాటు ఏపీలో సంతాపదినాలు
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంతాప సూచకంగా రెండు రోజులపాటు సంతాపదినాలు ప్రకటించారు.
17.ఎల్లుండి మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలు
గుండెపోటుతో ఈ రోజు మరణించిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి బుధవారం నెల్లూరు జిల్లాలోని బ్రాహ్మణపల్లి లో జరగనున్నాయి.
18.పవన్ పై ఏపీ మంత్రి కామెంట్స్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న నరసాపురం మత్స్యకార సభ లో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడంతో దీనికి ఏపీ మంత్రి అప్పలరాజు స్పందించారు.సీఎం చేపలు అమ్ముకోవాలా , మటన్ అమ్ముకోవాల అని అడుగుతున్నారని, మత్స్యకారుల బతుకులను మారకూడదా అని పవన్ ను ప్రశ్నించారు.
19.ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తా : కేసీఆర్
దేశ రాజకీయాలపై చర్చించేందుకు తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ అయ్యానని, ఇంకా అనేక మంది ప్రాంతీయపార్టీల అధ్యక్షులతోనూ భేటీ అవుతానని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -50,050