ఇదేందయ్యా ఇది: అనుకోకుండా మాయమైన నది..!

సాధారణంగా నదులు, సముద్రాలు అప్పటికప్పుడే మాయమవడం అనేది అస్సలు జరగదు.ఎందుకంటే అవి చాలా పెద్దగా నిత్యం నీటిని కలిగి ఉంటాయి.

 Himalayan River Suddenly Dried Up After A Mysterious Sink Hole Details, Kashmir,-TeluguStop.com

అయితే తాజాగా దక్షిణ కశ్మీర్‌లో ఒక నది ఉన్నపళంగా మాయమైపోయింది.అనునిత్యం భారీ ఎత్తున నీటితో ప్రవహించే ఈ నది ఒక్కసారిగా ఎలా మాయమవుతుంది? ఇది అసాధ్యం కదా? అని మీరు అనుకుంటే పొరపాటే.ఎందుకంటే ఇది నిజంగానే జరిగింది.దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.ఇది ఒక రకంగా మిస్టరీగా మారింది అంటే అతిశయోక్తి కాదు.

వివరాల్లోకి వెళితే.

అనంత్‌నాగ్‌లో  కోకెర్‌నాగ్‌లోని వందేవల్గామ్ ప్రదేశంలో బ్రెంగీ నది ప్రవహిస్తోంది.అయితే ఎప్పుడూ నీళ్లతో పరవళ్లు తొక్కే ఈ నది ఇప్పుడు 20 కిలో మీటర్ల మేర ఒక్క చుక్క నీరు కూడా లేకుండా వెలవెలబోతోంది.

ఇలా నీరు మాయమై పోవడానికి కారణం ఏంటో ఎవరికీ తెలియడం లేదు.ఈ నదిపై ఎలాంటి వంతెన గానీ ఆనకట్ట గానీ డ్యామ్ గానీ నిర్మించలేదు.

అందుకే నీళ్లు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలియక స్థానికులు అవాక్కవుతున్నారు.

ఈ క్రమంలోనే ఈ నదీ ప్రాంతాన్ని కొందరు అధికారులు కూడా పరిశీలించారు.

కానీ వారు కూడా దీనికి కారణం ఏమిటనేది పూర్తిస్థాయిలో కనుక్కోలేకపోతున్నారు.

ఎందుకంటే నీళ్లు మాయమవుతున్నా అవి ఎక్కడికి వెళ్లిపోతున్నాయనే జాడ తెలియడం లేదు.నదిలో ఏర్పడిన ఒక గోతి లేదా సొరంగం ద్వారా నీళ్లు వెళ్తున్నాయని కొందరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు కానీ ఆ నీళ్లన్నీ కేవలం ఒకే గోతిలోకి ఎలా ప్రవహిస్తాయి? అది నిండి పోయి నీళ్లు బయటికి రావాలి కదా? లోపలికి వెళుతున్న నీళ్లు బయటకు రాకుండా ఎటు వెళ్తున్నాయి? ఇలా చాలా విషయాలు ఎవరికీ అంతు చిక్కడం లేదు.ఇదిలా ఉండగా పక్కనే ఉన్న గ్రామాల భూముల కిందకు ఈ నీళ్లు ప్రవహిస్తూ వాటిని కూల్చువేస్తాయేమోనని చాలా మంది భయపడుతున్నారు.

దీనిపై సమగ్ర పరిశీలన అవసరమని ప్రభుత్వం కూడా అభిప్రాయపడి, అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసింది.అయితే ప్రస్తుతం ఈ నదీ పరివాహక ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించడం లేదని పోలీసులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube