దేశంలో రోజు రోజుకు మాదక ద్రవ్యాలు అతిపెద్ద సమస్యగా మారుతోంది.ఉత్సాహంగా ఉరకలెత్తాల్సిన యువత జవసత్వాలు సన్నగిల్లి యవ్వనం లోనే శారీరకంగా, మానసికంగా నిర్వీర్యమై పోతున్నారు.
మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్‌ను నాశనం చేసు కుంటున్నారు.రోజుల తరబడి మత్తులో ముంచెత్తే ఈ మహమ్మారి యువతనే లక్ష్యంగా చేసు కుంటోంది.
కళాశాలలో చదివే విద్యర్థులను సైతం వదలడం లేదు.సరదా కోసమంటూ మొదలెట్టి సరఫరా వరకు తెగబడుతున్న వారూ లేకపోలేదు.
ఈజీగా మనీ సంపాదించడం, మత్తుకు బానిస కావడం ఇటీవల కాలంలో కామన్‌గా మారి పోతోంది.అనేక మంది యువకులు అక్రమ రవాణాలోకి దిగి జీవితాన్ని జైలుపాలు చేసుకున్న వారూ ఉన్నారు.
తాజాగా ఈ కోవకే చెందిన ఓ ఘటన ఒంగోలు జరిగింది.ఓ బీటెక్ విద్యార్థి డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు.
ఒంగోలు రైల్వేస్టేషన్‌లో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న వైజాక్‌కు చెందిన బీటెక్ విద్యార్థిని ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు.బెంగుళూరు నుంచి వైజాగ్‌కు నిషేధిత మాదకద్రవ్యాలు తీసుకెళ్తుండగా పట్టుబడ్డాడు.అతని నుంచి రూ.2లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.4ఎల్ఎస్‌డీ స్టిక్కర్లు, 0.97 గ్రాముల ఎంఎండీఏ, 0.41 గ్రాముల ఈసీఎస్‌టీఏసీవై స్వాధీనం చేసుకున్నారు.
అయితే సదరు బీటెక్ విద్యార్థి చిన్నప్పటి నుంచే గంజాయికి బానిస అయినట్టు ఎస్ఈబీ అధికారులు తెలిపారు.సరదా కోసం వెళ్లి చివరికి డ్రగ్స్ సరఫరా చేసే పెడ్లర్‌గా మారాడని వెల్లడించారు.వైజాగ్ నుంచి బెంగుళూర్‌కు గంజాయి సరఫరా చేసి, అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకుని వెళ్తుండగా పట్టుబడ్డాడు.
యువత మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దని, భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.ఏది ఏమైనా డ్రగ్స్ నియంత్రణకు పోలీసులు, మీడియా వారు ఎంత కృషి చేస్తున్న వేళ్లూనుకుపోవడం గమనార్హం.
అయితే ఈ వీడియోను వైరల్ హాగ్ అనే ట్విట్టర్ ఖాతా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా నెటిజెన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.మీరూ ఈ ప్రమాద వీడియోపై లుక్కేసి కామెంట్ చేయండి.