కరోనా తర్వాత టాలీవుడ్ లో దుమ్మురేపే హిట్ అందుకున్న సినిమా అఖండ.ఈ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు బాలయ్యకు మంచి ఊపు ఇచ్చింది.
ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ మళ్లీ వీరిని కొత్త ఫామ్ లోకి తీసుకొచ్చింది.బాక్సాఫీస్ దగ్గర వీరి కాంబో సెన్సేషనల్ రికార్డులు సాధించింది.
కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్లను సాధించింది అఖండ.ఈ అఖండ విజయంతో సీక్వెల్ చేయాలని బోయపాటి, బాలయ్య బలంగా ముందకెళ్తున్నారు.
వీలైనంత త్వరగా అఖండ-2 సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలవుతున్నాయి.అల్లు అర్జున్ సహా మరికొంత మంది స్టార్లు ఈ సినిమా సీక్వెల్ తీయాలని కోరుతున్నారు.అయితే ఈ సినిమా అనేది ఇప్పట్లో సాధ్యమేనా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అఖండ-2 సినిమా విషయంలో బోయపాటికి కూడా రూట్ క్లియర్ కాలేదని తెలుస్తోంది.ప్రస్తుతం తను రామ్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.ఈ సినిమా కోసం బోయపాటి ఏకంగా రూ.12 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. బోయపాటి కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్ రెమ్యునరేషన్.
నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఆయనకు రికార్డు స్థాయిలో పారితోషకం ఇస్తున్నాడు.అటు రామ్ కూడా ఈ సినిమాకు పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు గాను రామ్ రూ.9 కోట్లు అందుకుంటున్నాడట.ఈ సినిమాలో బోయపాటి మార్క్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరెక్కబోతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం రామ్.లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకు కూడా శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత.
మొత్తంగా రామ్ తో రెండు సినిమాలు ఒకేసారి ఒప్పందం చేసుకున్నడు నిర్మాత చిట్టూరి.ది వారియర్ మూవీ పూర్తియిన వెంటనే బోయపాటి-రామ్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.బోయపాటి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ తో మరో సినిమా చేయాల్సి ఉంది.ఈ రెండు ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి.అప్పుడే అఖండ-2 సినిమా జోలికి వెళ్లే అవకాశం ఉంది.ఈ సమయంలో కథను సిద్ధం చేయించనున్నట్లు తెలుస్తుంది.
మొత్తంగా అఖండ-2 సినిమా 2024 చివర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.