బిడెన్ పై అమెరికన్స్ అసంతృప్తి...నిరుద్యోగ సమస్యకు దారేది....??

అమెరికాలో నిరుద్యోగం తారా స్థాయికి చేరుకుంటోంది.రోజు రోజుకు నిరుద్యోగ సమస్య అమెరికా ప్రభుత్వానికి పెద్ద తలనెప్పిగా మారింది.

 Unemployment Rates In America During The Covid-19 Pandemic,americans, Unemployme-TeluguStop.com

అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ శాతం పెరగడంతో ఏం చేయాలో కూడా పాలుపోని స్థితిలో ఉంది బిడెన్ ప్రభుత్వం. కరోనా మొదటి వేవ్ సమయం మొదలు ఇప్పటి ఒమిక్రాన్ వరకూ అమెరికా ప్రభుత్వం నిరుద్యోగులకు బృతి ఇస్తూనే ఉంది, ఈ క్రమంలోనే అమెరికా ఆర్ధిక స్థితిపై తీవ్ర ప్రభావం కూడా ఎర్పండింది.

దాంతో అమెరికన్స్ చాలా మంది బిడెన్ పాలనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట.

అమెరికాలో కరోనా వచ్చింది మొదలు కేవలం ఆరోగ్య పరిస్థితిలో మాత్రమే కాదు ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించింది.

అయితే ఈ పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా అమెరికాపై మాత్రం తీవ్రస్థాయిలో ప్రభావం చూపించింది.ప్రస్తుతం అక్కడి నిరుద్యోగ స్థితి ఏ స్థాయిలో ఉందంటే. అమెరికా కార్మిక శాఖ లెక్కల ప్రకారం.ఒమిక్రాన్ అమెరికాలో పెరుగుతున్న సమయంలో నిరుద్యోగ రేటు 1 శాతానికి పెరిగిందని దాంతో 4 శాతానికి నిరుద్యోగ రేటు చేరుకుందని తెలిపింది.

గతంలో అంటే 2020 ఏప్రియల్ నాటితో పోల్చితే నిరుద్యోగ శాతం తగ్గినప్పటికీ కరోనా ముందు పరిస్థితుల కంటే 3.5 శాతం ఎక్కువగా ఉందని దాంతో అమెరికాలో నిరుద్యోగులు 65 లక్షల మంది పెరిగినట్లుగా తెలుస్తోంది.అయితే వీరిలో శాశ్వతంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 16 లక్షలకు తగ్గగా, తాత్కాలికంగా ఉద్యోగాలు పోగొట్టుకున్న వారి సంఖ్య 9.60 లక్షలకు చేరుకుందని తెలిపింది.ప్రస్తుత నిరుద్యోగ లెక్కలు ఇప్పటి పరిస్తితికంటే కూడా భవిష్యత్తులో భారీగా మార్పు చెందే అవకాశం ఉందని, అయితే ఆ పరిస్థితి ఎలా ఉండబోతోందో చెప్పడం ఇప్పుడే సాధ్యం కాదని వైట్ హౌస్ ఆర్ధిక సలహా మండలి మాజీ ఛైర్మెన్ ప్రొఫెసర్ జాసన్ ఫరమన్ ప్రకటించారు.ఇదిలాఉంటే నిరుద్యోగ సమస్య నుంచీ బయట పడటంలో బిడెన్ సర్కార్ పూర్తి వైఫల్యం చెందిందని, ఇప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం ఇచ్చేలా ప్రభుత్వం కనిపించడం లేదని అమెరికన్స్ బిడెన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Unemployment Rates In America During The COVID-19 Pandemic,Americans, Unemployment Rate, COVID-19 Pandemic, America - Telugu America, Americans, Covid Pandemic, Omicron

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube