రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా హుందాగా.గంభీరంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఎవరు ఏమన్నా సరే కేవలం స్పందించేంత ప్రభావం ఉన్న విమర్శలకు మాత్రమే స్పందించాలి తప్ప.మిగతా వాటికి మాత్రం పెద్దగా స్పందించకూడదు.
ఇలా అడిగిన వారికల్లా.అడిగిన దానికల్లా స్పందిస్తూ పోతూ ఉంటే.
చులకన అయిపోతారు.ఈ విషయాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సోము వీర్రాజుకు తెలియనివి కావు.
పైగా ఆయన ఇప్పుడు బీజేపీకి ఏపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.అలాంటి స్థాయిలో ఉన్న ఆయన ప్రతి చిన్న దానికి వర్రీ అయిపోతున్నారంట.
మరి ఆయన ఏ విషయంలో ఇలా అవుతున్నారు అంటే.తన కూతురు విషయంలో అంట.
మామూలు గానే సోముకు ఎవరు ఏమీ అనకూడదు అనే అలవాటు ఉంది.తనను ఎవరు వేలెత్తి చూపించినా అస్సలు ఊరుకోరు.
వెంటనే సమాధానం ఇచ్చేస్తారు.ఇలాంటివి రాజకీయాల్లో కొంచెం ఇబ్బంది కలిగించే అంశాలనే చెప్పాలి.
అయితే రీసెంట్ గా సోము అల్లుడు ఓ కేసులో చిక్కుకున్నారు.ఇది పెద్ద ఇష్యూ కావడంతో సోము రంగంలోకి దిగి.
తనకు తన అల్లుడుకు సంబంధం లేదంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశారు.
కాగా ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉంటే.ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుందని, ఆమెతో తనకు ఎలాంటి సంబంధాలు లేవంటూ కూడా చెప్పుకొచ్చారు.అయితే సంక్రాంతి నాడు ఆ కేసులో ఇరుక్కున్న అల్లుడు కాస్తా ఇంటికి వచ్చాడు.
దీంతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇదే విషయంపై విమర్శించారు.మామ, అల్లుడు కలిసే ఇలాంటి పని చేస్తున్నారంటూ ఆరోపించారు.
దీంతో వెంటనే సోము మీడియా ముందుకు వచ్చేశారు.నన్నే విమర్శించేంత మొగాడివా! అంటూ ఫైర్ అయ్యారు.
వాస్తవానికి ఇలాంటి చిన్న చిన్న విమర్శలకు సోము స్పందించాల్సిన అవసరం లేదు.కానీ ఇలా ప్రతి దానికి ఓవర్ గా రియాక్టు అయ్యి తన స్థాయిని తగ్గించుకుంటున్నారంట.
.