రెమ్యునరేషన్ పెంచేసిన పెళ్లిసందD శ్రీలీల.. సినిమాకు ఎంత తీసుకుంటున్నారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల రెమ్యునరేషన్లు గత కొన్నేళ్లలో అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే.కొత్త హీరోయిన్లు సైతం సక్సెస్ సాధిస్తే రెమ్యునరేషన్ ను పెంచడానికి వెనుకాడటం లేదు.

 Tollywood Heroine Sreeleela Remuneration Details Here-TeluguStop.com

రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లి సందD సినిమాతో శ్రీలీల టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చినా దసరా పండుగకు పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమా హిట్ గా నిలిచింది.

శ్రీలీల ఎక్స్ ప్రెషన్లు, డ్యాన్స్ లు పెళ్లిసందD సినిమాకు హైలెట్ గా నిలిచాయి.ఈ సినిమా తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ బ్యూటీకి సినిమా ఆఫర్లు ఊహించని స్థాయిలో వస్తుండగా ఈ హీరోయిన్ కూడా తన రెమ్యునరేషన్ ను ఊహించని స్థాయిలో పెంచేశారని సమాచారం.ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఈ బ్యూటీ 75 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

శ్రీలీల తొలి సినిమా రెమ్యునరేషన్ తో పోల్చి చూస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.

Telugu Sri Leela, Srileela, Kruthishetty, Pellisandad, Raviteja, Sreeleela, Vais

వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో, నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారని బోగట్టా.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ రెండు సినిమాలు తెరకెక్కనున్నాయని వార్తలు వస్తుండగా ఈ సినిమాలకు కొత్త డైరెక్టర్లు పని చేస్తున్నారని తెలుస్తోంది.

Telugu Sri Leela, Srileela, Kruthishetty, Pellisandad, Raviteja, Sreeleela, Vais

శ్రీలీల వరుసగా గుర్తింపు, మార్కెట్ ఉన్న హీరోలకు జోడీగా నటిస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.కృతిశెట్టి ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా పేరుప్రఖ్యాతులు సాధించగా శ్రీలీల కూడా కృతిశెట్టి తరహాలో గోల్డెన్ లెగ్ అనిపించుకుంటారేమో చూడాల్సి ఉంది.శ్రీలీలకు అంతకంతకూ క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube