కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో వినిపించే కొన్ని మీమ్స్ బలే క్రేజీగా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయి.ఈ క్రమంలోనే ఇటీవల రాజమౌళి కి సంబంధించిన మీమ్స్ వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే.
అదేమిటంటే రాజమౌళితో సినిమా చేస్తే ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని కానీ ఆ తర్వాత సినిమా ఫ్లాప్ గా మారుతుంది అంటూ మీమ్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.ఇక తాజాగా దర్శకుడు శేఖర్ కమ్ముల విషయంలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
అదేమిటంటే శేఖర్ కమ్ముల తో సినిమా చేస్తే విడాకుల పక్క అనే కొత్త నినాదాలు వైరల్ చేస్తున్నారు.అయితే అందుకు గల కారణాలు కూడా లేకపోలేదు.
ఎందుకంటే శేఖర్ కమ్ముల తో కలిసి సినిమా చేస్తున్న వాళ్లు ఒక్కొక్కరుగా విడాకుల బాట పడుతున్నారు.దర్శకుడు శేఖర్ కమ్ముల తన కేరీర్ లో దాదాపుగా పెళ్లి కానీ హీరోలలో తోనే ఎక్కువగా సినిమాలు చేశారు.
ఇక పెళ్లయిన హీరోలతో సినిమా చేసిన ప్రతి సారి కూడా ఆ సదరు హీరోలు తమ భార్యలకు ఇచ్చేస్తున్నారు.అక్కినేని హీరో సుమన్ తో కలిసి గోదావరి సినిమాను తీసిన విషయం తెలిసిందే.
ఈ సినిమా తర్వాత సుమంత్ తన భార్య కీర్తి రెడ్డి కి విడాకులు ఇచ్చాడు.ఆ తరువాత నాగ చైతన్య తో కలసి లవ్ స్టోరీ సినిమాను చేసిన విషయం తెలిసిందే.

లవ్ స్టోరీ సినిమా నాగచైతన్య సమంత కు విడాకులు ఇచ్చేశారు.ఇక ఇటీవలే హీరో ధనుష్, భార్య ఐశ్వర్య విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.18 ఏళ్ళ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకుంటున్నట్లు వారిద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం నాగ చైతన్య, ధనుష్ విడాకుల బాధ్యత పూర్తిగా శేఖర్ కమ్ములదేనట.
ఆయనతో సినిమా చేయడం వల్ల నే ఆ ఇద్దరు హీరోలకు తమ భార్యలతో గొడవలు తలెత్తాయని.మీమ్స్ రాయుళ్లు సృష్టించిన ఈ లాజిక్ విని కొందరు నవ్వుకుంటున్నారు.