ప్రస్తుతం ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారం గురించి చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే.ఇప్పట్లో ఈ వ్యవహారం సద్దుమణిగేలా కనిపించడం లేదు.
ఇదే విషయంపై టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలుగజేసుకుని తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వం పై ప్రశ్నలు వేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటూ ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే వర్మ అనుకున్నట్లుగా మంత్రి పేర్ని నాని తో భేటీ కూడా జరిగింది.
ఇక రామ్ గోపాల్ వర్మ తాజాగా మరొకసారి తన అభిప్రాయాలను ప్రభుత్వానికి ట్వీట్ల వర్షం ద్వారా తెలియజేశారు.
సినిమాలు కాకుండా మరే ఇతర ప్రైవేటు ఉత్పత్తుల మీద ఏపీ ప్రభుత్వం ఇలాంటి ధరలు నిర్ణయించి నిబంధనలు తీసుకు వచ్చిందా? ఒకవేళ చేస్తే ఆ సంస్థలు వాటి ఉత్పత్తుల పేర్లు చెప్పండి.500 కోట్లతో నిర్మించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోటి రూపాయలతో నిర్మించిన సినిమాకు ఒకటే రేట్ అంటే ఎలా? సినిమాను ఎంత పెట్టి తీస్తున్నారో మాకు అవసరం లేదు మేము ధరను నిర్ణయిస్తున్నామని ప్రభుత్వం అంటే.ప్రపంచంలో ఎక్కడైనా తయారైన వస్తువులకు ఇలాంటి నిబంధన ఉంటుందా అని ప్రశ్నించారు ఆర్జివి ఇలా రేట్లను తగ్గించడం వల్ల మొత్తం నిర్మాణాలే ఆపేసేందుకు అవకాశం ఉంది అని తెలిపారు.
ఇతర రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు 2200 లు ఉన్నాయి.కానీ ఏపీలో మాత్రం కనీసం 200 కూడా లేదు.ఇది ఖచ్చితంగా ఆర్టికల్ 14 ను ఉల్లంఘించడమే అవుతుంది అని తెలిపారు ఆర్జీవి.
అలాగే వర్మ నాలుగు ఆప్షన్స్ ను ఎంకరేజ్ చేయమని కోరారు.అందులో మొదటిది పిక్చర్ టైమ్ అనే ఒక టెక్నాలజీ ని వాడండి.ఒక చిన్న ట్రక్కులో అయినా ఎక్కడికంటే అక్కడికి వెళ్లి సినిమాలను చూపించవచ్చు.
ఇది ఎక్కువగా ఉత్తరాదిన అమల్లో ఉంది అని తెలిపారు.ఇక రెండవది కారవ్యాన్ టాకీస్.
ఊర్లో అందరికీ ప్రదర్శించేందుకు ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది.ఇది మూవీ ఆన్ వీలర్ కాన్సెప్ట్ అని తెలిపారు అర్జీవి.
మూడవది నోవా సినిమాస్.ఫ్యాబ్రికేషన్ తో సినిమా థియేటర్లు కట్టడం, ఖాళీగా ఉన్న ప్లాట్లలో కూడా వీటిని నిర్వహించవచ్చు అని తెలిపారు.ఇక నాలుగవది పెద్ద రూములు, గ్యారేజ్ లు, వాడకంలో లేని గోదాంలను కూడా థియేటర్లుగా వాడేందుకు ఎంకరేజ్ చేయాలి అంటూ ఇలా నాలుగు ఆప్షన్లను ప్రభుత్వానికి వర్మ సూచించాడు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వర్మ కురిపించిన ఈ నాలుగు ట్వీట్ల వర్షం హాట్ టాపిక్ గా మారింది.