చెట్టు లోప‌ల నుంచి దారి చూపించిన గూగుల్ మ్యాప్‌.. షాక్‌లో నెటిజన్లు

మనం ఏదేని కొత్త ప్రదేశానికి వెళ్లినపుడు కంపల్సరీగా ఉపయోగించే యాప్ ‘గూగుల్ మ్యాప్స్’. ఆ ప్రదేశానికి ఎలా రీచ్ కావాలో తెలుసుకునేందుకుగాను గూగుల్ మ్యాప్ డైరెక్షన్స్ చూస్తుంటాం.

 Google Map Showing The Way From Inside The Tree Netizens In Shock Details, Googl-TeluguStop.com

అలా మ్యాప్స్ ఎటు వైపునకు చూపిస్తే అటు వైపునకు ప్రయత్నిస్తుంటాం.అలా సెర్చ్ ఇంజిన్ గూగుల్ అందించే ఫ్రీ సర్వీస్‌ను యూజ్ చేసుకుని డెస్టినేషన్స్‌కు వెళ్తుంటాం.

అలా మన జర్నీని గూగుల్ మ్యాప్స్ ఈజీ చేస్తున్నాయి.కాగా, తాజాగా గూగుల్ మ్యాప్స్ తప్పుడు దోవ చూపించాయి.

ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నది.ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.

ప్రపంచంలో ఎక్కువ మంది యూజ్ చేసే యాప్స్‌లో కంపల్సరీగా ఉండేది గూగుల్ మ్యాప్స్.అయితే, ఈ మ్యాప్ ఒక్కోసారి ప్రదేశాలకు చిత్ర విచిత్రమైన రూట్స్ చూపిస్తుంటుంది.

ఓన్లీ బైక్ వెళ్లగలిగే రూట్స్ లో కారు కూడా వెళ్లగలదని అంటుంటుంది.తాజాగా ఇటువంటి చిక్కు ఒకటి ట్విట్టర్ యూజర్ ఆల్‌ఫ్రెడ్ కు ఎదురైంది.

దాంతో ఆ విషయమై సదరు యూజర్ ట్వీట్ చేయగా, అది చర్చనీయాంశమవుతున్నది.

అసలేం జరిగిందంటే.

ఆఫ్రికాలోని ఘనా ప్రాంత సమీపంలోని అక్రాకి చెందిన ఆల్‌ఫ్రెడ్ ఇటీవల గూగుల్ మ్యాప్స్ లో చూస్తూ  వేరే చోటుకు వెళ్లాడు.

Telugu Africa, Alfred, Ghana, Google, Google Map, Mango Tree, Route Tree, User-L

ఆ చోటుకు వెళ్తున్న క్రమంలో తనుక దారి కనబడలేదు.అయితే, అప్పటికే ఆల్‌ఫ్రెడ్ గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని ఉన్నాడు.గూగుల్ మ్యాప్స్ చూపిస్తున్న డైరెక్షన్స్ ప్రకారం ఆల్‌ఫ్రెడ్ మూవ్ అవుతున్నాడు.

అయితే, గూగుల్ మ్యాప్స్ చూపిస్తున్న రూట్‌లో తప్పుంది.అక్కడకు వెళ్లిన క్రమంలో మామిడి చెట్టు ఉంది.

అయితే మ్యాప్స్ మాత్రం అదే రూట్ కరెక్టని అంటుంది.అలా పేర్కొన్న క్రమంలో తాను డెస్టినేషన్‌కు ఎలా వెళ్లాలి.

చెట్టులో నుంచి వెళ్లాలా? అని గూగుల్ మ్యాప్స్‌ను ఉద్దేశించి ఆల్‌ఫ్రెడ్ ట్వీట్ చేశాడు.ఆ ట్వీట్ నెటిజన్లకు బాగా కనెక్టయింది.

నెటిజన్లు తమకు గూగుల్ మ్యాప్స్‌తో జరిగిన చేదు అనుభవాలను ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube