గన్నవరం ఎమ్మెల్యే వైసీపీ పార్టీ మద్దతుదారుడు వల్లభనేని వంశీ చంద్రబాబు పై సీరియస్ కామెంట్లు చేశారు.చంద్రబాబు చివరిదశలో ఉన్నాడని తెలంగాణలో దుకాణం చేసుకున్న పరిస్థితి ఆంధ్రాలో వచ్చే ఎన్నికల తర్వాత లేకపోతే అంతకుముందే టీడీపీ దుకాణం సర్దుకోవటం గ్యారెంటీ అని పేర్కొన్నారు.
పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే పెట్రోల్ బంకు దగ్గర ధర్నాలు చేస్తారా.? నిత్యావసరాలు ధరలు పెంచితే కిరణ దుకాణాల ముందు ధర్నాలు చేస్తారా.అసలు చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని అన్నారు.
చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆయన మాటలు నమ్మవద్దని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు వల్లభనేని వంశీ స్పష్టం చేశారు.
పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పై ఎందుకు ప్రశ్నించడం లేదు వైసీపీ ప్రభుత్వం పై.ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు.ఓటుకు నోటు కేసు భయమా.? అంటూ సెటైర్లు వేశారు.మూడుసార్లు ముఖ్యమంత్రి 40 సంవత్సరాలకు పైగానే రాజకీయాల్లో ఉన్నారు చంద్రబాబు ఎప్పుడైనా నిజాలు చెప్పి రాజకీయాలు చేయాలని వల్లభనేని వంశీ సూచించారు.
టీడీపీ కేడర్ కూడా ఏది పడితే అది నమ్మకూడదని పేర్కొన్నారు.