రేపు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) పోలవరం ప్రాజెక్ట్ సందర్శించనున్నారు.రెండు కాఫర్ డ్యాం లతో పాటు కుంగిపోయిన డయాఫ్రం వాల్ ను ఆయన పరిశీలించనున్నారని రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ రామ్( Bharat Margani ) వెల్లడించారు.

 Chief Minister Jaganmohan Reddy Will Visit The Polavaram Project Tomorrow , Jag-TeluguStop.com

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనాలోచిత నిర్ణయాల వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిందని స్పష్టం చేసారు.

గోదావరి వరదల సమయంలో నీటి ప్రవాహ వేగానికి ఎగువ దిగువ కాఫర్ డ్యాం ల మధ్య భారీ గుంతలు ఏర్పడ్డాయని తెలిపారు.

ఆ గుంతలను పూడ్చడానికి లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలిస్తున్నామన్నారు.పనులు జరుగుతున్న తీరును సిఎం పరిశీలించిన అనంతరం కేంద్రం నుంచి నిధులు విడుదలవుతాయన్నారు ఎంపి భరత్.

వేసవి తాగు నీటి ఎద్దడి దృష్ట్యా రాజమండ్రి పార్లమెంట్ పరధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు వాటర్ ట్యాంకర్లను సమకూర్చారాయన.రాజమండ్రి దేవి చౌక్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించిన అనంతరం వాటిని ఆయా నియోజకవర్గాలకు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube