సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ ఒక్కటుంటే సరిపోదని, అది నిరూపించుకోవడానికి అవకాశం కూడా రావాలని సినీ పెద్దలు చెప్తుంటారు.అది నిజమే.
అవకాశం లభిస్తేనే తమలోని ప్రతిభ వెండితెరపైన ఆవిష్కృతమవుతుంది.అలా ఓ పసివాడికి అవకాశమొచ్చింది.
ఆ బాలుడి పేరు రాము.
నిజానికి రాము అని పేరు స్క్రీన్ మీద కనబడేది మాత్రమే.
ఆ బాలుడి అసలు పేరు వేరే ఉంది.వీర వెంకట రాంబాబు.
పేరు పెద్దగా ఉందని రాము అని పెట్టేశారు.బెజవాడకు చెందిన ఇతడు వెండితెరమీదకు ఎలా వచ్చాడంటే.
అసిస్టెంట్ డైరెక్టర్ రంగూన్ రామారావు ఒకసారి అనుకోకుండా బెజవాడకు వచ్చాడు.అప్పుడు సదరు బాలుడు తనలోని టాలెంట్ మొత్తం రంగూన్ రామారావుకు చూపించాడు.
తనకు వచ్చిన డ్యాన్స్, ఫైట్స్ చేసి చూపించగా, రంగూన్ రామారావు ఇంప్రెస్ అయిపోయాడు.దాంతో బాలుడికి తన సినిమాలో వేషం ఇప్పిస్తానని చెప్తాడు.
అయితే, బాలుడి తల్లి సినిమాలు వద్దని హెచ్చరిస్తుంది.అయినప్పటికీ ఆ బాలుడు వినకుండా మద్రాసు వచ్చేశాడు.
తమిళ్ సినిమాలో చాన్స్ వచ్చింది.అలా అతడి పేరు ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయింది.
అంతే ఇక ఆ తర్వాత శోభనబాబు చిన్న నాటి పాత్ర పోషించే అవకాశం రాముకు వచ్చింది.అలా ఒక్కొక్క సినిమాలో పెద్ద హీరోల చిన్న నాటి వేషాలు వేసుకుంటూ రాము బాగా పాపులర్ అయ్యాడు.

ఈ క్రమంలోనే తాను కూడా పెద్దయ్యాక హీరో అవుతానని అనుకున్నాడు పాపం ఆ పసివాడు.ఆ సమయంలోనే నెక్స్ట్ లెవల్‌లో తనకు పలు పాత్రలు పోషించే అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులను రాము సినిమాలో హీరోగా అవకాశాలివ్వాలని అడిగాడు.అలా ఓ సినిమా ఓకే కూడా అయింది.కానీ, బయటకు రాలేదు.వారికుండే లెక్కలు వారికి ఉంటాయి కదా.అలా రాము పెద్దవాడయ్యాక అతడిని పక్కనపెట్టేశారు దర్శక నిర్మాతలు.దాంతో రాము సినీ ఇండస్ట్రీ వదిలేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.వేరే రంగంలో ఏదో ఒక పని చేసుకుని ముందుకు సాగాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి.అతడికి తాను ‘పసివాడు’గా ఉన్నపుడే సినిమాల్లో అవకాశాలు ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు ముందుకొచ్చారని అప్పుడు అర్థమైంది కావచ్చు.